Consciousness with jesan

జనసేనతో చైతన్యం

Date:08/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో రాష్ట్ర ప్రజలలో చైతన్యం వస్తోందని , ఎన్నికల్లో జనసేనకు విజయం వరిస్తుందని పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు , న్యాయవాది శివప్పనాయుడు , నానబాలకుమార్‌లు తెలిపారు. శనివారం మండలంలోని భీమగానిపల్లె గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్పనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి అక్రమాలలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన పార్టీని, రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్నారు. ఎన్నికల్లో జనసేన అధినేతకు మద్దతుగా నిలిచి , ముఖ్యమంత్రిని చేసేంత వరకు ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివకుమార్‌రెడ్డి, చైతన్యరాయల్‌, పగడాల రమణ, విరూపాక్షి, శ్రీనివాసులు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మాగుంట ఆఫీసుల్లో  ఐటీ అధికారుల సోదాలు

Tags: Consciousness with jesan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *