మంత్రి గౌడ్ హత్యకు కుట్ర…

హైదరాబాద్ ముచ్చట్లు:
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు మహబూబ్ నగర్ జిల్లా కలకలం రేపుతోంది.  జిల్లాలో హత్యారాజకీయాలు బట్టబయలు కావడంతో అందరూ నివ్వెరపోతున్నారు.  సుపారీ డీల్… శ్రీనివాస్ గౌడ్ తో పాటు అతడి సోదరుడు హత్యకు ప్లాన్ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల విచారణలో బట్టబయలయిన సంగతి తెలిసిందే.  మహబూబ్ నగర్ కు చెందిన యాదయ్య, రఘు, విశ్వనాధ్, నాగరాజులు ఈహత్యకు కట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తితో 12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్యకు జరిగిన కుట్ర బయటపడింది. గత నెలలో… ఫిబ్రవరి 23 నెలలో ఫరూక్, హైదర్ ఆలీలు సుచిత్రా లో ఒక లాడ్జిలో ఉన్నారు. 25వ తేదీన లాడ్జీ నుంచి బయటకు వచ్చినప్పుడు కొందరు కత్తులతో వీరిని చంపేందుకు ప్రయత్నించారు. వీరు తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. యాదయ్య, నాగరాజు, విశ్వనాధ్ అనే మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తులు వీరిపై దాడికి ప్రయత్నించారని ఫిర్యాదు అందింది. వీరిద్దరిని 26వ తేదీన అరెస్ట్ చేశామన్నారు. రఘు మరికొందరితో కలసి హత్యకు కుట్రపన్నారని పోలీసుల విచారణలో తేలింది. దీనిపై విచారించగా రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూధన్ రాజులను ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూధన్ రాజు, అమరేందర్ లు కలసి మహబూబ్ నగర్ నుంచి విశాఖ వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. అక్కడ షెల్టర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ ఇచ్చారు. ఇందులో కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.వీరిని విచారించగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నినట్లు తేలిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రాఘవేంద్ర రాజు మంత్రిని అంతమొంచేందుకు ఫరూక్ తో కాంటాక్ట్ అయ్యాడు. పదిహేను కోట్లు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారు. ఈ కుట్రలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. మధుసూధన్ రాజు, అమరేందర్ రాజులు నగదును సమకూరుస్తామని చెప్పారన్నారు. పోలీసు కస్టడీకి తీసుకుని లోతుగా విచారిస్తామని చెప్పారు. వీరి వద్ద ఉన్న ఆయుధాలను ఉత్తర్ ప్రదేశ్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. ఈ హత్య వెనక ఎవరెవరున్నారన్నది తర్వాత విచారణలో తేలుతుందన్నారుశ్రీనివాస్ గౌడ్ హత్యకు ఎందుకు ప్లాన్ చేశారు? అందుకు రాజకీయ కారణాలేవైనా ఉన్నాయా? వ్యక్తిగత విభేదాలా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.
 
Tags:Conspiracy to assassinate Minister Goud …

Natyam ad