మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర గర్హనీయం-మంత్రి నిరంజన్ రెడ్డి.

వనపర్తి ముచ్చట్లు:
ప్రజా జీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పనిచేసి ప్రజల ఆదరణ పొందాలి. కానీ రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడాలి అనుకోవడం, హత్యా రాజకీయాలకు కుట్రలు చేయడం  గర్హనీయం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద వెలుగు చూసిన హత్యాయత్నం కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నాను.  మానవత్వంతో పనిచేయడానికి, సేవచేయడానికి కులాలు, మతాలు, ఎల్లలు ఉండవు. అదే సమయంలో దుర్మార్గాలు చేసే వారికి కూడా కులాలు, మతాలు, ఎల్లలు ఉండవు.  తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్  దిశానిర్దేశంలో  జిల్లాను సస్యశ్యామలం గావించే దిశగా ముందుకు సాగుతున్నాం.   పాలమూరు జిల్లా ప్రశాంతమైన జిల్లా ఆ వాతావరణం కలుషితం కావద్దు. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు ప్రజలకు వెల్లడించాలి.
 
Tags:Conspiracy to assassinate Minister Srinivas Gowda is illegal – Minister Niranjan Reddy

Natyam ad