ఏబీవీ కేసులో సుప్రీం  కోర్టు ధిక్కరణ

గుంటూరు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి మరోసారి కోర్టుల్ని ప్రశ్నించే దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సారి నేరుగా సుప్రీంకోర్టుతోనే ఢీ కొట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తాజా పరిణామలు నిరూపిస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ముగిసిందని ఆయనకు తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాలు గడిచిపోయినా ఇంత వరకూ ప్రభుత్వం ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టుతీర్పు వచ్చిన తర్వాత ఓ సారి చీఫ్ సెక్రటరీని కలిసి సుప్రీంకోర్టు ఉత్తర్వులను.. తనకు పోస్టింగ్ ఇవ్వాలన్న లెటర్‌ను ఇచ్చారు. ప్రాసెస్‌లో పెడతామని చెప్పిన చీఫ్ సెక్రటరీ ఆ తర్వాత సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు జరిగినప్పుడుకూడా కనీసం సర్వీసులోకి తీసుకున్నట్లుగా కూడా ఆదేశాలు ఇవ్వలేదు. తనకు పోస్టింగ్ ఇవ్వాలని పూర్తి జీతం ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. ఇదే విషయాన్ని అడిగేందుకు మరోసారి ఆయన మంగళవారం సచివాలయానికి వెళ్లారు. కానీ అక్కడ సీఎస్ లేరు. మరోసారి బుధవార వెళ్లి కలిసి తన పోస్టింగ్, జీతం గురించి అడగాలని ఏబీవీ నిర్ణయించుకున్నారు. గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కక్ష పెంచుకుంది. చాలా రకాల ఆరోపణలు ప్రచారం చేసి.. చివరికి సింపుల్ కేసులు పెట్టింది. వీటన్నింటినీ వదిలి పెట్టబోనని ఆయన అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ధిక్కరణకు కూడా పాల్పడటానికి సిద్ధమేనన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉండటంతో అధికారుల్లోనూ కలకలం ప్రారంభమయింది.

 

Post Midle

Tags:Contempt of the Supreme Court in the ABV case

Post Midle
Natyam ad