నిరంతరాయంగా  స్టార్లర్లు

వరంగల్ ముచ్చట్లు:
 
గతంలో కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో మెజారిటీ రైతులు విద్యుత్ వచ్చినప్పుడు తమ పొలాలు పారేలా ఆటోమేటిక్ స్టార్టర్లను బోర్లకు బిగుంచుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం నిరంతర విద్యుత్ సరఫరా దృష్ట్యా ఆటోస్టార్టర్లతో విద్యుత్ నిరూపయోగం అవుతూ వృథా పెరిగింది. 24 గంటలపాటు సరఫరా చేస్తుండడంతో ఆటోస్టార్టర్లు నిరంతరంగా కొనసాగుతున్నాయి, ఈ నేపథ్యంలో ఆటోస్టార్టర్లను తొలగించేలా రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు ఆటోస్టార్టర్లు తొలగించాలని అవగాహన కల్పించకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తూ నిరంతర సరఫరా చేస్తుంటే, పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణిని జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్న దృష్ట్యా రైతులంతా ఆటోస్టార్టర్లు తొలగించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే జిల్లాలో మాత్రం ఆ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించింది లేదు. నిరంతర సరఫరా అమలుచేపట్టి నెలరోజులు గడుస్తున్నా, జిల్లాలో ప్రత్యేకంగా రైతులకు అవగాహన కల్పించకపోవడం గమనార్హం. నెలరోజులుగా కేవలం వెయ్యిలోపు రైతులు మాత్రమే తమ ఆటోస్టార్టర్లను తొలగించారంటే, ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమానికి అధికారులు ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ, ఆయా డివిజన్ల డీఈలు ఆటోస్టార్టర్లు తొలగించాలని రైతులకు అవగాహన కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రైతులు ఏదేని సమస్యపై ఫిర్యాదు చేస్తే పరిష్కరించేందుకు వెళ్లే సిబ్బందితో మాత్రమే రైతులకు ఆటోస్టార్టర్లను తొలగించాలని సూచిస్తున్నారే తప్ప ప్రత్యేకంగా అవగాహన కల్పించడం లేదు.
 
 
ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి కోట్లు వెచ్చిం చి కొనుగోలు చేసి సరఫరా చేస్తున్న నిరంతర విద్యుత్ నిరూపయోగమవకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఊరూరా చాటింపుల ద్వారా రైతులు ఆటోస్టార్టర్లు తొలగించాలని అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జిల్లాలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు 3.89 మిలియన్ యూనిట్లను రైతులు వినియోగిస్తున్నారు. అదేవిధంగా గతంలో 190 మెగావాట్ల డిమాండ్ ఉండగా, ప్రస్తుతం 207 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. ఆటోస్టార్టర్లు ఆన్‌లో ఉండడం వల్ల మోటర్ ప్రారంభమయ్యే సమయంలో విద్యుత్ లోడ్ 6-8 రెట్లు పెరుగుతుంది. అంతేకాకుండా అవసరంలేకున్నప్పటికీ మోటరు నడుస్తుండడంతో తీవ్రనష్టం జరుగుతుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆటోస్టార్టర్లు పూర్తిగా తొలగించినట్లయితే చాలా వరకు ఆదా అయ్యే అవకాశాలున్నాయి. అదేవిధంగా జిల్లాలో 2.63 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, గృహ అవసరాల కనెక్షన్లు 1.84 లక్షలుండగా, 17 వేలు కమర్షియల్, 3 వేలు పరిశ్రమల కనెక్షన్లు, 54,500 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లలో సుమారు 40 వేలకుపైగా ఆటోస్టార్టర్లు ఉపయోగిస్తున్నారు. వీటిలో మరో 39 వేల ఆటోస్టార్టర్లు తొలగించాల్సి ఉంది. అదేవిధంగా నిరంతర విద్యుత్ సరఫరాకుగాను రూ.75 కోట్లు ఖర్చు చేసి నెలరోజులుగా అందిస్తున్నారు. నిరంతర కరెంట్ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని 5 మిలినియర్ నుంచి 8 ఆంపియర్‌కు మార్చారు. అంతేకాకుండా ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ ఉన్నచోట అదనంగా మరొకటి ఏర్పాటు చేశారు. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా 30 ట్రాన్స్‌ఫార్మర్లను అదనంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిరంతర విద్యుత్‌కుగాను కొత్త లైన్లను కూడా వేశారు. బొంరాస్‌పేట్ నుంచి కొడంగల్ వరకు ప్రస్తుతమున్న ఫీడర్ ఓవర్‌లోడ్ అయ్యే అవకాశమున్న దృష్ట్యా కొత్త లైన్ వేశారు. నిరంతర విద్యుత్‌తో జిల్లా అంతటా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Continuous starlers

Natyam ad