కలమల్లలో కార్డన్ అండ్ సెర్చ్

కడప ముచ్చట్లు:
 
కడప సబ్ డివిజన్, కలమల్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్యాక్షన్ ప్రభావిత మాలేపాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. పోలీసులు  గ్రామంలో అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.  ఫ్యాక్షనిస్టులకు, వారి అనుచరులకు ఎర్రగుంట్ల రూరల్ సి.ఐ రవీంద్రనాథ్ రెడ్డి, అర్బన్ సి.ఐ మంజునాథ్ రెడ్డి  కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామం లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలమల్ల ఎస్.ఐ చంద్రమోహన్, వి.ఎన్ పల్లి ఎస్.ఐ మధుసూదన్ రెడ్డి, ఎర్రగుంట్ల ఎస్.ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గోన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Cordon and search in Kalamalla

Natyam ad