చిరంజీవికి కరోనా

హైదరాబాద్ ముచ్చట్లు:
 
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. థర్డ్‌ వేవ్‌ ప్రతాపం ముఖ్యంగా సినీ ఇండస్ట్రీపై ఎక్కువగా చూపిపిస్తోంది. తరచూ సినీ స్టార్‌లు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. అయితే తనకు కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయని చిరంజీవి ట్విట్ చేశారు.  ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నన్ని తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు ‘కరోనా బారిన పడకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాటిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. స్వ‌ల్పంగా ల‌క్ష‌ణాలున్నాయి. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను. ఈ మ‌ధ్య కాలంలో న‌న్ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా టెస్టులు చేయించుకోండి. త్వ‌ర‌లోనే మీ అంద‌రినీ క‌లుస్తాను’’ అని తెలిపారు.ఈ మేరకు ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని చెబుతానని అభిమానులకు భరోసానిస్తూ చిరు ట్వీట్ చేశారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో.. చిరంజీవి త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు మెగా ఫ్యాన్స్. అటు సినిమా తారలు కూడా చిరు త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా.. సెట్స్‌పై గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలున్నాయి. ఇవి కాకుండా వెంకీ కుడుముల సినిమాల చేయడానికి ఆయన రీసెంట్‌గానే ఓకే చెప్పారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ సినిమా చిత్రీకరణలో చిరంజీవి పాల్గొంటున్నారు. చిరంజీకి కరోనా రావడంతో దాదాపు రెండు వారాల పాటు ఆయన సినిమా షూటింగ్స్ అన్నీ వెనక్కి వెళ్లినట్లే.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Corona to Chiranjeevi

Natyam ad