శ్రీశైలంలో కరోనాకలకలం

శ్రీశైలం ముచ్చట్లు:
 
శ్రీశైల మండలంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి.  మండలంలో మొత్తం 38 కరోనాన పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.  బుధవారం రాత్రి శ్రీశైలంలోని అమ్మవారి ఆలయంలో ఒక అర్చకుడికి కరోన పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు స్థానిక ప్రాధమిక వైద్యశాల వైద్యుడు తెలిపాడు మండలంలోని మోత్తం కరోన పాజటీవ్ కేసులలో శ్రీశైలం 29, సుండిపెంట 9 పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే దేవస్థానం క్షేత్రపరిధిలో కరోన ఆంక్షలను కట్టుదిట్టం చేసినప్పటికీ కరోన కేసులు పెరగడంపై ఉద్యోగస్తులలో, స్థానికులలో, వ్యారస్తులలో భయాందోళన మొదలైంది క్షేత్ర పరిధిలో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, తరచూ స్వీయ రక్షణతో మెలగాలని, భౌతికదూరం పాటించాలని దేవస్థానం ఈవో లవన్న పాధమిక వైద్యశాల వైద్యుడు సోమశేఖర్ సూచించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Coronary artery in Srisailam

Natyam ad