Natyam ad

దళితుని ఇంటిపై కార్పొరేటర్ కన్ను

అర్ధరాత్రి జేసీబీతో హల్ చల్
ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు
సెటిల్మెంట్ చేసుకోమని ఉచితసలహా
విలేకరుల సమావేశంలో వాపోయిన బాధితుడు
ఖమ్మం ముచ్చట్లు:
 
50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్  దళితుడినైన నాఇంటిపై కన్నేసి ఖాళీచేయాలని బెదిరింపులకు గురిచేస్తూ గురువారం అర్ధరాత్రి జేసీబీతో పేడేటి రమేష్ మరికొంతమంది గూండాలతో కలిసొచ్చి కులంపేరుతో దూసిస్తూ ప్రహరిగోడను కూలగొట్టి భయబ్రాంతులకు గురిచేశారని బాధితుడు మోదుగు అరుణ్ రాజ్ ఆరోపించాడు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్ రాజ్ మాట్లాడుతూ..ఖమ్మం పట్టణంలోని రమణగుట్ట దగ్గర తనకు మరొక ఇల్లు కలదు. ఇంటి నెంబర్ 11-10-782/ఏ/1 ఇల్లును అక్రమించుకోవాలనే దురుద్దేశంతో 50వ డివిజన్ కార్పొరేటర్ “రాపర్తి శరత్” పేడేటి రమేష్, వీరితోపాటు చాలామంది రౌడీలు కలిసి మమ్ములను చంపేసి మా ఇల్లును అక్రమించుకోవలనే కుట్రలో భాగంగా గురువారం అర్ధరాత్రి సుమారు 12:30 నుండి 1:00 సమయంలో అందరూ పడుకున్నాక మా ఇంటిమీదకు జేసీబీని తీసుకొని వచ్చి  మీరు ఇల్లు కాళీచేయాలని, లేని పక్షంలో మిమ్మల్ని కిరాయికి ఉన్నవాళ్లను అందరిని జేసీబీతో తొక్కిస్తామని దాడి చేసి మా ఇంటి ప్రహరీ గోడను కులగొట్టగా నేను పోలీసువారి 100 డైల్ నెంబర్ కి కాల్ చేసి చెప్పినా పోలీసులు కాలయాపన చేసినారన్నారు.
 
 
 
ఇదే ఇంటి విషయమై ఈ నెల 5వ తారీకున ఇల్లు కాళీచేయాలని, నన్ను కులం పేరుతో తిట్టినారని, గత 10 రోజులుగా రెండవ టౌన్ పోలీసు స్టేషన్, ఖమ్మం ఏసీపీ ఆఫీసులో కూడా దరఖాస్తు చేసి యున్నాను అయినాగాని నాకు న్యాయం చేయకపోగా నన్ను బెదిరిస్తున్నారని ఆరోపించాడు. ఇదేమని అడుగగా పోలీసులు సెటిల్మెంట్ చేసుకోమని, కేసు పెట్టబోమని చెపుతూ నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టినారని ఆరోపించాడు. ఇట్టి పరిణామాలదృష్ట్య మరల రాత్రి కూడా ఇలానే దౌర్జన్యం చేయగా నేను గట్టిగా గట్టిగా అరుస్తుండగా చుట్టుపక్కల వాళ్ళు లేచి వారుకూడా రాత్రి పూట ఇలా చేయడం ఇది కరక్ట్ కాదు మీరు “ప్రజా ప్రతినిదిగా” ఉండి రౌడీలాగా ఇలా చేయడం కరక్ట్ కాదు అని చుట్టుపక్కల పక్కన వారు నిలదీయగా “రాపర్తి శరత్” నేను అధికార పార్టీ కార్పొరేటర్ ని నా ఇష్టమొచ్చినట్లు చేస్తాను అని మీరు ఎవరికి చెప్పుకున్న నన్ను ఏమి చేయలేరని చెపుతూ, పోలీసులు కూడా మావాళ్లే అని నన్ను పదే పదే “మాదిగోడా” అని తిడుతూ భయబ్రాంతులకు గురిచేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఈ విలేకరుల సమావేశంలో రాజుల రాధాకృష్ణ, రాజుల స్వరూప, కాంపాటి నర్సమ్మ పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Corporator eye on Dalit house