Cost of funding is to say: MLC Somma Veerraju

నిధుల ఖర్చు చెప్పాలి : ఎమ్మెల్సీ సోము వీర్రాజు

Date:13/02/2018
విజయవాడ  ముచ్చట్లు:
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి రూ.2,500 కోట్లు ఇచ్చామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మంగళవారం నాడు అయన విజయవాడలో   మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు, సంస్థలు ఇచ్చిందని, ఆ నిధులు ఎక్కడ ఖర్చుచేశారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లు, పదేళ్లలో నిర్మించాలని చట్టంలో లేదని వీర్రాజు పేర్కొన్నారు.దక్షిణ భారతం పట్ల వివక్ష అని మాట్లాడడం సరికాదన్నారు. బీహార్, ఉత్తర్ప్రదేశ్ మనకంటే దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం రెవెన్యూ లోటు రూ.4,600 కోట్లుగా తేలిందని, కానీ ఏపీ సర్కారు రూ.16వేల కోట్లు అంటోందన్నారు. రుణమాఫీ, సంక్షేమం కూడా రెవెన్యూ లోటులో చూపారని పేర్కొన్నారు. రైల్వే జోన్, కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి ఫిజిబిలిటీ లేదని కమిటీలు చెబుతున్నాయన్నారు. 10 ఏళ్ల సమయం ఉన్నా.. చట్టంలో ఉన్నవి చేస్తున్నామన్నారు. పోలవరం నిర్మాణానికి వంద శాతం నిధులివ్వాలని మాత్రమే చట్టంలో ఉందన్నారు. పోలవరానికి ఎప్పటిలోగా కట్టాలనే కాలపరిమితి ఏమీ లేదన్నారు. చంద్రన్న కానుక, తోఫా డబ్బులు ఎక్కడివో టీడీపీ చెప్పాలన్నారు.రాజధానిలో పరిపాలన భవనాల నిర్మాణాలకు కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని, వెంకయ్యనాయుడు మరో వెయ్యి కోట్లు ఇచ్చారని వివరించారు. ఏపీకి 16 వర్సిటీలు ఇచ్చామన్నారు. రాజధాని నిర్మాణం గురించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను పరిశీలించాలని మాత్రమే చట్టంలో ఉందన్నారు. ప్రత్యేక హోదా రాలేదని ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోవడం లేదన్నారు. దుగ్గరాజపట్నం పోర్టుపై తొలినుంచి వివాదాలు ఉన్నాయన్నారు. పోర్టు కోసం భూసేకరణ చేస్తే నిర్మిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. అలాగే కమిటీ నివేదిక వచ్చాక కడప స్టీల్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకుంటారని వీర్రాజు తెలిపారు.
Tags: Cost of funding is to say: MLC Somma Veerraju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *