Couple murder in Warangal

వరంగల్ లో దంపతుల దారుణ హత్య

Date:19/06/2018
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ జిల్లాలోని హసన్‌పర్తిలో ఇద్దరు వృద్ద దంపతుల దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు దంపతులను గొంతుకోసం హత్య చేశారు. మృతులు దామోదర్, పద్మలుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఘటనా స్థలానికి సీపీ రవీందర్ చేరుకుని కేసు విచారిస్తున్నారు.వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు భార్యాభర్తల్ని కిరాతకంగా గొంతు కోసి హత్య చేయడం కలకలంరేపింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం. హసన్‌పర్తికి చెందిన దామోదర్, పద్మలు దంపతులు. వీరు స్థానికంగా ఓ కిరాణా షాపు నడుపుతున్నారు. రోజూ ఉదయాన్నే షాపు తీసేవారు. కాని ఇవాళ మాత్రం తీయకపోవడంతో ఇరుగుపొరుగున ఉన్నవారికి అనుమానం వచ్చింది. తలుపు ఎంత కొట్టినా కూడా తీయలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు వెళ్లిన పోలీసులు.. ఇంటి తలుపు తీసి చూడగా సామానంతా చిందవందరగా పడి ఉంది. దామోదర్‌ను ఇంట్లోనే దారుణంగా గొంతు కోసి హత్య చేయగా.. భార్య పద్మను బాత్‌రూమ్‌లో చంపేశారు. వారిపై కారం కూడా చల్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం కూడా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇంట్లో సామాను పడేయడంతో ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు కూడా ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఇది దోపిడీ దొంగల పనిగా అనుమానిస్తున్నారు. క్లూస్‌ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అలాగే హత్య జరిగిన స్పాట్‌ను వరంగల్ సీపీ రవీందర్ పరిశీలించారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని.. స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించామన్నారు.
Tags:Couple murder in Warangal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *