రాష్ట్రంలో సీపీఎస్ ను రద్దు చేయాలి-పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్

జగిత్యాల ముచ్చట్లు:
 
తెలంగాణ ప్రభుత్వం కూడా రాజస్థాన్ రాష్ట్రం తరహాలోన్ ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్(కొత్త పెన్షన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం)విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ కోరారు.గురువారం జిల్లా కేంద్రంలో సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం రాజస్థాన్ రాష్ట్ర శాసనసభలో  సీపీఎస్ ను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఉపాధ్యాయుల జీవితాలు సాఫీగా సాగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకోవాలని  తమ సంఘం తరపున కోరారు. జిల్లా కార్యదర్శి బొల్లంవిజయ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,రఘుపతి, హన్మంత్ రెడ్డి, విద్యాసాగర్,అలిశెట్టి ఈశ్వరయ్య,నారాయణ, యాకూబ్,కరుణ తదితరులు పాల్గొన్నారు.
 
Tags:CPS should be abolished in the state- Hari Ashok Kumar, District President, Pensioners Association

Natyam ad