సీపీఎస్‌ రద్దు చేయాలి…పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి – ఉద్యోగుల డిమాండు

తిరుపతి ముచ్చట్లు :

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండు చేస్తూ టీటీడి, ఎన్‌జీవోలు, టీచర్లు తిరుపతిలో మోటారుసైకిల్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు నాగార్జున, వెంకటేష్‌, ఎన్‌జీవోల సంఘ నాయకులు రేగంటి దేవానంద్‌, మురళి, ఉద్యోగ సంఘ నాయకుడు గురుమూర్తి, మునిశేఖర్‌లు మాట్లాడుతూ సీపిఎస్‌ రద్దు చేయాలంటు ముఖ్యమంత్రిని పలుమార్లు కలసినా ప్రయోజనం చేకూరలేదన్నారు. రాష్ట్రంలో 1,84 లక్షల కుటుంభాలు సీపిఎస్‌ విధానంతో వీధినపడిందన్నారు. ఈ విషయమై ప్రతిపక్షనాయకుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని తక్షణం అమలు చేయాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని సంఘ నాయకులు ప్రకటించారు.

 

Tag : CPSs should be abolished … implementation of oldpension policy – Employee demand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *