సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ : సీపీ రవీందర్ 

Date:13/04/2018
జనగాంముచ్చట్లు:
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 39 మండలాల్లోఈ నెల 20 తేదీలోగా ధిలో సీసీ టివిలను ఏర్పాటు చేస్తామని పోలీసు కమిషనర్ డా రవీందర్ అన్నారు. శుక్రవారం నాడు అయన జనగాం టౌన్ పోలీస్ స్టేషన్ ని అకస్మికంగా తనిఖీ చేసారు. తరువాత తరిగొప్పులలో  మీడియాతో మాట్లాడుతూ కోసం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన పూర్తిచేయ్యడానికి పోలీసులు  నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు.  ట్యాబ్ ల ద్వారా పెట్టి కేసులు కూడా నమోదు చేస్తున్నామని, నూతన టెక్నాలజీతో కేసులను త్వరగా చెస్ చెయ్యగలుగుతున్నామన్నారు.  సీసీ టీవీలు ప్రతి గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నాం. క్రైమ్ తగ్గించడానికి వంద శాతం పని చేస్తామని అన్నారు. త్వరలో గ్రామాలన్నీ సిసి టీవీల నిఘాలో ఉంటాయి. అనంతరం తరిగొప్పుల లోని పోలీస్టేషన్ ని సందర్శించారు. ఇక్కడ క్రైమ్ రేట్ రేట్ తక్కువగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ బాపిరెడ్డి, సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సైలు రాజేష్ నాయక్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:Crime control with CES cameras: Cepie Ravinder

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *