మహిళలపై తగ్గని నేరాలు

Date : 21/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత:) అని ఆర్యోక్తి. మాతృదేవో భవ: అనే సనాతన ధర్మానికి నెలవు భారతదేశం.పరారు స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువర్యుంది. మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యకృత్యమయ్యారు. పోలీసులున్నారు. చట్టాలున్నారు. కానీ నేరాలు జరుగుతూనే ఉన్నారు. అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. మహాత్ముడు అర్థరాత్రి అన్నాడు. కానీ పట్టపగలే తిరగలేని పరిస్థితి దాపురించింది. ఇంటి నుంచి వెళ్ళిన అమ్మారు / మహిళ క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదు. గృహ హింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం.. ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చారు. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించట్లేదు. దేశంలో రోజు రోజుకూ మహిళలపై పెరిగిపోతున్న అకృత్యాలు, అత్యాచారాలు, నిర్భయ లాంటి ఘటనలు, కొత్త చట్టాల నేపథ్యంలో భారత దేశంలో మహిళల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నారు. భారతదేశంలో ప్రతీ గంటకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురికావడం దేశంలో నెలకొన్న పరిస్థితి ఎంత విషమంగా ఉందో చెబుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది. ప్రతి 34 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ప్రతి 42 నిమిషాలకు ఒక మహిళపై లైంగిక వేధింపులు, వరకట్నం కోసం ప్రతి 99 నిమిషాలకు ఒక వధువు బలి అవుతోంది. 2012లో దేశవ్యాప్తంగా మహిళలపై 2,44,270 నేరాలు జరిగారు. ఏటా మహిళలపై నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యాచారాలు, అపరహరణలు, వరకట్న వేధింపులు, అమ్మారుల అక్రమ రవాణా ఇలా అనేక విధాలుగా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ నేరాలు మహిళాభివృద్ధికి శాపంగా మారారు. చిన్నారులు, యువతులు, మహిళలపై నగరాలు, పట్టణాలు సహా చివరికి గ్రామాల్లో సైతం విచక్షణరహితంగా దాడులు జరుగుతున్నారు. 2011లోనే దేశంలోని 53 మహానగరాల్లో 33,789 మంది మహిళలపై దారుణాలు జరిగారు. 2009-11 సంవత్సరాల మధ్య దేశంలో మొత్తం 68 వేల మందికి పైగా మహిళలపై అత్యాచారాలు జరిగారు. మధ్యప్రదేశ్‌లో ఎక్కువ కేసులు నమోదయ్యారు. అక్కడ మూడేళ్లలో 9,539 మందిపై దాడులు జరిగారు. జాతీయ నేర గణాంక సంస్థ గణాంకాల ప్రకారం వరకట్న సంబంధ సమస్యలతో 2001 జనవరి నుంచి 2012 డిసెంబర్‌ వరకు 91,202 మంది మహిళలు మృత్యువాత పడ్డారు. 2012లోనే మొత్తం 8,233 వరకట్న చావులు నమోదయ్యారు. ముఖ్యంగా 2007 నుంచి 2011 వరకు ఏటా అవి పెరుగుతూనే ఉన్నారు. 2007లో 8,093 , 2011 వచ్చే సరికి 8,618 కి పెరిగింది. అరునా ఈ కేసుల్లో దోష నిర్ధారణ శాతం 2011తో పోల్చితే 2012లో 3.8 శాతం తగ్గడం గమనించాల్సిన విషయం. 2008లో 4 గంటలకోసారి వినిపించిన ఆర్తనాదం ఇప్పుడు గంటకొకటిగా మారింది. దేశంలో మహిళల్లో 70 శాతం మంది ఏదో ఒక రూపంలో గృహ హింసను ఎదుర్కొంటున్నారు. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి మహిళలపై ఏదో ఒక అఘారుత్యం జరుగుతూనే ఉంది. ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకసారి భర్త అత్తమామల రూపంలో వివాహితలు వేధింపులు, హింస బారిన పడుతున్నారు. పనిచేసే మహిళల్లో ఎక్కువ శాతం విధులకు వెళ్లి వచ్చేటప్పుడు తమకు రక్షణ లేదని వెల్లడించారని అసోచామ్‌సర్వే తేల్చింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలతో పాటు ముంబై, పూణె, కోల్‌కతా, హైదరాబాద్‌లోని పెద్ద సంస్థలతో పాటు, మధ్యస్థ చిన్నతరహా కంపెనీల్లో పనిచేస్తున్న 5 వేల మందిని ఈ సంస్థ సర్వే చేయగా, ఏకంగా 92 శాతం మహిళలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బీపీఓ, ఐటి అనుబంధ రంగాలు, హాస్పిటాలిటీ, పౌర విమానయానం, నర్సింగ్‌హోమ్స్‌లో పనిచేస్తున్న మహిళలు తమకు తగిన రక్షణ లేదని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు అందుబాటులో లేకపోవడం, సమాచార లోపాల కారణంగా నేరాలకు ఆస్కారం ఏర్పడుతోంది. పట్టణాల్లో పోలీసు భద్రత, నిరంతర గస్తీ ఉన్నప్పటికీ నేరాలు విచ్చల విడిగా జరుగుతున్నారు. అభం శుభం తెలియని పసిమొగ్గలతో పాటు బాలికలు, మహిళలపై జరిగే దాడులు దేశానికి మచ్చతెస్తున్నారు. విదేశీ మహిళా పర్యాటకులపై చోటుచేసుకుంటున్న వేధింపుల సంఘటనలు ఆందోళనకర స్థారులో ఉన్నాయని సాక్షాత్తూ పర్యాటక శాఖే నిగ్గుతేల్చింది. రాజ్యాల కోసం యుద్ధాలు జరిగినా, దేశ విభజనలు జరిగినా, సామాజిక సమస్యలపై పోరాటాలు జరిగినా, కులమతాల కుమ్ములాటలు జరిగినా మొదటి బాధితులు మహిళలే అవుతున్నారు. చివరికి వినిమయ సంస్కృతిలో ఒక మారకపు వస్తువుగా మార్చేస్తున్నారు. ఫలితంగా అమ్మ కడుపులోనే అంతం చేసేందుకు కూడా సాహసిస్తున్నారు. ఇలా పుట్టుక నుంచి చావుదాకా అడుగడుగునా ఆంక్షలతో, అభద్రతతో జీవించాల్సిన స్థితికి నెట్టబడుతున్నారు. అనాదిగా కొనసాగుతున్న పితృసామ్య వ్యవస్థ మహిళలను శారీరకంగా, మానసికంగా బలహీనులుగా మార్చి లింగపరమైన అసమానతల సమాజంగా మార్చడం వల్లనే మహిళలపై వివిధ రకాల దాడులు జరుగుతున్నాయని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మహిళలను సంభోగ వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా, వంటింటి కుందేలుగా, వరకట్నం తీసుకువచ్చేవారిగా మాత్రమే చూస్తూ వారిపై అజమారుషీ చలారుంచే పితృస్వామిక భావజాలం సమాజంలో బాగా పాతుకుపోరు ఉంది. భారతీయ సమాజంలో ఆడది అంటే చులకన భావం వ్యాపించి ఉంది. పురుషాధిక్య సమాజం మహిళను ఏమీ చేయలేని బలహీనురాలు, నిస్సహాయురాలిగా చిన్నచూపు చూస్తోంది. దీనిని ఉగ్గుపాలతో కలిపి తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచుతున్నారు. భార్య, తల్లి, పక్కింటమ్మారు అందరూ ఆడవాళ్ళే. వారిపై నేనేం చేసిన చెల్లుబాటు అవుతుందనే ధోరణి. వారిని దాడులకు పురిగొల్పుతోంది. స్త్రీ అస్తిత్వాన్ని గుర్తించని పితృస్వామిక ఆధిపత్య ధోరణి మహిళలపై లైంగిక, భౌతిక దాడులకు కారణమవుతోంది. మహిళలపై హత్యాయత్నాలు, భౌతిక దాడులకు ప్రధాన కారణం వరకట్నం. నిరక్షరాస్యుల నుంచి ఉన్నత విద్యావంతుల వరకు, పేదల నుంచి కోటీశ్వరుల వరకు అందరూ వరకట్నం కోసం, అదనపు కట్నం కోసం మహిళలను చిత్రవధ చేస్తున్నారు. మహిళలను అన్ని రకాల వ్యవస్ధలలోనూ ఆట వస్తువుగానే చూస్తున్నారు. మహిళపై లైంగిక దాడులకు మరో ప్రధాన కారణం చలనచిత్ర, శ్రవణ మాధ్యమాలు. స్త్రీ అంగాంగ ప్రదర్శన, వర్ణనలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు చలనచిత్ర, దృశ్య మాధ్యమాలు. స్త్రీని వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కాకుండా శృంగార వస్తువుగా చిత్రీకరిస్తున్నారు. ఫిలిం సెన్సార్‌ బోర్డు ఉన్నా ఐటం సాంగ్‌ లేని సినిమాలు రాకపోవడం దురదృష్టకరం. హీరోరుజం.. సినిమాలు, హీరోల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హీరోరున్‌ ప్రేమిస్తున్నట్లు.. దానికి ఎంతకైనా తెగించి గొప్ప ప్రేమగా నిరూపించుకున్నట్లు.. సినిమాల్లో చూపిస్తారు. దీన్నే నిజజీవితంలో నేటి యువత పాటిస్తుంటారు. రాక్షస ప్రేమతో అమ్మారుల మనసులు గాయపరుస్తుంటారు. ఇది చాలా అనర్ధదాయకం. సినిమాల్లో ప్రేమ పేరుతో మహిళలపై జరిగే దాడిని చూపించే దృశ్యాలను కట్టడి చేయకపోవడం వల్లే ఈ విపరిణామాలు సంభవిస్తున్నాయంటున్నారు మహిళాసంఘాలు. అటు సీరియళ్లలోనూ మహిళలపై దౌర్జన్యాలను చూపిస్తున్నారు. దీనివల్ల యువత పెడదోవ పడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సాంకేతికరంగ అభివృద్ధి సమాజానికి ఎంత మేలు చేస్తుందో అంతే విచ్ఛిన్నం కలిగిస్తోంది. టెక్నాలజీని దుర్వినియోగం చేయడం వల్ల జరిగే దుష్పరిణామాల్లో మహిళలపై లైంగిక దాడులు కూడా ఒకటి. నియంత్రణ లేని అశ్లీల సాహిత్యం, అసభ్యకర దృశ్యాలు నేడు మొబైల్స్‌, ల్యాప్‌ టాప్‌, కంప్యూటర్‌ లలో దర్శనమిస్తున్నారు. ఇవన్ని చాలా సులభంగా లభిస్తుండటం వల్ల యువత మనసులను కలుషితం చేయడమే కాదు స్త్రీలపై లైంగిక దాడులకు, అత్యాచారాలకు పాల్పడేలా పురికొల్పుతున్నట్లు అనేక కేసుల్లో వెల్లడైంది. సమాజంపై పాశ్చాత్యీకరణ ప్రభావం విపరీతంగా పెరిగిపోరుంది. పాశ్చాత్య దేశాల్లో విచ్చలవిడి శృంగారం లాంటి పెడ ధోరణుల ప్రభావంతో యువత మహిళలపై లైంగిక దాడులకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. విదేశీ సంస్కృతి ప్రభావంతో యువత ఆడవారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఉదంతాలు లెక్కలేనన్ని వెలుగులోకి వస్తున్నారు. సమాజంలో అన్ని వ్యవస్థల్లోనూ నైతిక విలువలు పతనమవుతుండటం కూడా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక దాడులు పెరగడానికి ఒక కారణమే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమవడంతో పిల్లల్లో తగిన పరిపక్వత, సంపూర్ణ వ్యక్తిత్వం పెంపొందటం లేదు. వ్యక్తిగత క్రమశిక్షణ, స్వీయ నియంత్రణపై యువతకు తగిన మార్గనిర్దేశం చేసేవారే కరువయ్యారు. ఇంటా బయటా వారికి తగిన క్రమశిక్షణ, జవాబుదారీతనం లోపించడం కూడా నేర తీవ్రతకు దారితీస్తుంది. అమ్మారులు ప్రేమ అంగీకరించని కారణంగా అబ్బారులు యాసిడ్‌ దాడులు, గొంతుకోయడం లాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అమ్మారు తనకు దక్కలేదని కసి, పగ, ద్వేషాలు పెంచుకొని దాడులు చేస్తున్నారు. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదని బాహ్య సౌందర్యాన్ని పాడుచేయాలని యాసిడ్‌ దాడులు చేస్తున్నారు. నేరప్రవృత్తి ఉన్నవారే ఎక్కువగా ఈ నేరాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి పరిణామాల కారణంగా జీవనశైలిలో మార్పులు వస్తున్నారు. ప్రమాణాలు మారుతున్నారు. ఇదే తరహాలో నేరాలూ పెచ్చరిల్లుతుండటం ఆందోళనకర పరిణామం. సామూహిక అత్యాచారాల వంటి క్రూర ఘటనలు నానాటికీ పెరిగిపోతుండటం సభ్యసమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అత్యాచారం కేవలం మహిళల సమస్యకాదు. సమాజంలోని మానసిక రుగ్మతకు చిహ్నం. అడుగంటుతున్న మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనం. అనేక ఘటనల్లో అత్యాచారానికి పాల్పడిన నిందితులు, బాధితులకు తెలిసినవారై ఉంటున్నారు. విద్యావంతులైనవారు సైతం వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. మహిళలపై ఇంటా బయటా ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి సామాజికంగా జరుగుతున్న ప్రయత్నాలు నామమాత్రం. అందుకే ఎలాంటి జంకు లేకుండా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వరకట్న నిషేధ చట్టం, గృహ హింస చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, భ్రూణ హత్యల నియంత్రణ చట్టం లాంటివి ఎన్ని వచ్చినా వాటిపై ఇప్పటికీ ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహనే లేదు. దీనివల్ల తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. నేరాలకు పాల్పడుతున్నవారికి కూడా ఇటువంటి చట్టాలపై అవగాహన ఉండట్లేదు. నిర్భయ చట్టం వచ్చాక కూడా దేశంలో వందల కొద్దీ కేసులు నమోదవ్వడం దీనికి నిదర్శనం. మహిళలకు సంబంధించి ఇప్పటికే అనేక చట్టాలు వచ్చారు. వరకట్న నిషేధిత చట్టం వచ్చినా అది అమలుకు నోచుకోలేదు. ఇలా అనేక చట్టాలు వచ్చినా వాటి అమలు జరగడం లేదు. చట్టాలు రావాలి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం, ప్రజలు మారాలి. చట్టాన్ని సరిగా అమలు చేసే యంత్రాంగం, చట్టం స్ఫూర్తిగా నడిచే అధికారులు ఉండట్లేదు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఒక బాల నిందితుడికి మూడేళ్ల శిక్షపడటం చట్టపర లొసుగుల ఫలితమే. శిక్ష అమలులో జాప్యం: 2009-11 మధ్యలో మహిళలపై దాడులకు పాల్పడినవారిలో నేర నిరూపణ జరిగి శిక్షపడింది కొద్దిమందికి మాత్రమే. వేధింపుల కేసుల్లో కూడా శిక్షలు అంతంత మాత్రంగానే పడుతున్నారు. 2009-11 సంవత్సరాల మధ్య దేశంలో మొత్తం 1,22,292 కేసులు నమోదయ్యారు. 27,408 మందికే శిక్షలు పడ్డారు. నేరానికి పాల్పడిన వాడిని వెంటనే వెతికి పట్టుకొని కోర్టులో హాజరు పరచాలి. కానీ, పోలీసులే నేరాలు చేస్తున్నారు. అందుకే నేరస్తులు భయపడడం లేదు. లోపభూరుష్ఠమైన విచారణ విధానాలు, తగిన సాక్ష్యాలు సేకరించలేక పోలీసులు చేతులెత్తేస్తుండటంతో నిందితులు శిక్షల బారి నుంచి సులభంగా తప్పించుకోగలుగున్నారని కేంద్ర హోంశాఖ వర్గాలు వాపోతున్నారు. అత్యాచారం కేసుల్లో పోలీసులు తగిన విధంగా స్పందించడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నవే. ఈ దేశంలో చట్టంతో, పోలీసులతో మొత్తం మారిపోతుందనుకోవడం అవివేకం. ప్రభుత్వాలు సైతం శిక్షలను పకడ్బందీగా అమలు చేయాలి. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, భౌతిక దాడులకు పాల్పడే నిందితులను సమాజం నుంచి వెలేస్తారని తెలిసినా దాడులకు పాల్పడుతున్నారు. దీనికి కారణం సదరు నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండడమే. దాంతో కేసును ఎలాగైనా కప్పి పుచ్చవచ్చనే దురుద్దేశంతో దాడులకు వెనుకాడడం లేదు. దేశవ్యాప్తంగా వివిధ పార్టీల తరపున ఎన్నికైన 369 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై అత్యాచార కేసులు నమోదైనట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని ప్రజాస్వామ్య హక్కుల సంస్థ వెల్లడించింది. దేశంలోని మహిళలకు ఆయా పార్టీలు ఇచ్చే గౌరవం ఎలాంటిదో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. రక్షణ కల్పించాల్సిన పాలకుల స్థానంలో భక్షించే కీచకులున్నారని మరోసారి తేటతెల్లమైంది. అత్యాచార కేసుల్లో నిందితులుగా పరిగణించి, కోర్టు విచారిస్తున్న ఆరుగురు ప్రముఖులకు వివిధ పార్టీలు టికెట్లు ఇచ్చారు. వారంతా ప్రస్తుతం శాసన సభల్లో కొనసాగుతున్నారు. 2009లో లోక్‌సభలో ఎంపికైన ఆరుగురు ఎంపీలు అత్యాచార కేసుల్లో చిక్కుకున్నవారే. వీరే కాదు మరో 34 మంది ఎంపీలు సైతం మహిళా వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నేర చట్టాలను అవసరాలకనుగుణంగా మార్చడానికి, తగిన సూచనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌.వర్మ అధ్యక్షతన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌ హై కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి లీలాసేథ్‌, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ గోపాల స్వామి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను క్షుణ్ణంగా సమీక్షించిన ఈ కమిటీ సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిటీ సూత్రబద్ధమైన లక్ష్యాలకే పరిమితం కాకుండా మహిళల భద్రత, రక్షణకు అవసరమైన, విస్తృతమైన సిఫార్సులను చాలా లోతుగా సామాజిక కోణం నుంచి చేసింది. 644 పేజీల నివేదికలో సునిశితత్వం, సమగ్రత రెండూ కన్పిస్తున్నాయని, మహిళల పరిస్థితి మెరుగవడానికి ఈ నివేదిక దోహదం చేస్తుందని సానుకూల స్పందన వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని క్రిమినల్‌ నేరాల చట్ట సవరణలో చేర్చలేదన్నదే కీలక చర్చనీయాంశం.

Tags: Crimes against women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *