కొత్త నియోజకవర్గాలపై కోటి ఆశలు

హైదరాబాద్ ముచ్చట్లు:

అసెంబ్లీ సీట్ల పెంపు కోసం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ఉందని దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రానికి లేఖలు రాసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు నిపుణులతోసంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా చేసింది. ఇటీవలే నియోజవకర్గాల డీమిలిటేషన్ కూడా పూర్తి చేసింది. దానికి ఆమోద ముద్ర వేసి ఎన్నికలు జరిపించాల్సి ఉంది. అయితే ఎప్పుడో విభజన జరిగి.. చట్టంలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉందని.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కోరనున్నారు. గతంలో కూడా కేసీఆర్ అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు. తర్వాత వది లేశారు. చంద్రబాబు ప్రయత్నాలు చేస్తే ఎద్దేవా చేశారు. ఇప్పుడు చాన్స్ లేదని తెలిసినా మరోసారి కేసీఆర్ ప్రయత్నం చేయాలనుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. మామూలుగా బీజేపీతో పోరు చేస్తున్నారు.ఇప్పుడు ఆయన డిమాండ్ ను బీజేపీ అసలు పట్టించుకునే అవకాశం ఉండదు. రాజకీయంగా లబ్ది కలుగుతుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని బీజేపీ నేతలు తేలిగ్గానే ఊహించగలరు. అలాంటప్పుడు.. కేసీఆర్‌కు లాభం కలిగేలా ఎందుకునియోజకర్గాల విభజన చేస్తారు ? గతంలో చాలా సార్లు కేంద్రం… తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని కేంద్రం ప్రకటించింది.

 

Tags: Crore hopes on new constituencies

Natyam ad