దళిత కుటుంబం వెలి -ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా

ఏలూరు ముచ్చట్లు:
 
ఒకే కులానికి చెందిన దళిత సంఘాల్లో ఇంకా అనాగరికత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే దళితులకు సంబంధించిన సంఘంలో కులాంతర వివాహం చేసుకున్నాడని నెపంతో వారి కుటుంబానికి 20 వేల రూపాయలు జరిమానా కట్టాలని కట్టని పక్షంలో మా సంఘంలో కి రావద్దు అని నిర్మొహమాటంగా చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర  ధర్నా నిర్వహించారు.
బాధిత కుటుంబాలతో ఇరుగుపొరుగువారు మాట మంచి లేకుండా కనీస అవసరాలైన నిత్యవసర వస్తువులు కూడా ఆ కుటుంబానికి ఇవ్వకూడదని ఆశ వర్కర్ గాని వాలంటరీ గాని ఆ కుటుంబం దగ్గరికి వెళ్లకుండా  అడ్డుకుంటున్నారని ఆరోపించారు.  నీరు నిప్పు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ రోజు మా ఇంట్లో మా ఇంటి యజమాని అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే కనీసం ఆర్ఎంపీ డాక్టర్ ను  కూడా రానివ్వకుండా చేస్తున్నారని భాధను వ్యక్తం చేశారు.  తన కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని నెపంతో మా ఇరువురి రెండు కుటుంబాలకు సఖ్యతతో పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ పెద్దలకు సంబంధించిన కొంత అమౌంట్ ఇవ్వలేదని కారణంతో సంఘంలో తప్పు వేయడంతో మేము ఆ తప్పుకు ఫైన్ కట్టలేదని  సాకులు చూపి మమ్మల్ని ఆ సంఘం నుంచి వెలి వేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో స్థానిక  ఎమ్మార్వోను ఆశ్రయించమని  అన్నారు.  ఇంతవరకు ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని నవంబర్ 8 వ తారీఖున పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పటికీ ఇంతవరకు ఎవరు ఇంటి వైపు కూడా చూడలేదని అన్నారు. స్పందనలో ఫిర్యాదు చేసినా కానీ ఎటువంటి  స్పందన కనపడలేదని ఆ కుటుంబం మొత్తం కుటుంబ సభ్యులతో ఈరోజు పోడూరు మండలం తాసిల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వారి గోడు వెళ్లబోసుకున్నారు. వెలివేసిన పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని వెలి నుండి విడిపించండి  మాకు న్యాయం చేయండి లేకపోతే మాకు సావే శరణం అనే శ్లోకంతో పెద్ద ఎత్తున నినాదాలు  చేశారు. లేనిపక్షంలో చావడమే తప్ప వేరే మార్గం లేదని ప్రాధేయపడ్డారు.
 
Tags; Dalit family dharna in front of Veli-Emmaro office

Natyam ad