దామోదరరాజు సేవలు అభినందనీయం

– ఘనంగా డిఎంఆర్‌ జన్మదిన వేడుకలు
– పేదలకు సేవ చేయడం దేవుడిచ్చిన వరం
 
చౌడేపల్లె ముచ్చట్లు:
 
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పిటీ సభ్యుడు ఎన్‌. దామోదరరాజు సేవలు అభినందనీయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. గురువారం దామోదరరాజు 66 వజన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. పార్టీ నేతలతో కలిసి పంజాణి వారిపల్లెలో దామోదరరాజు స్వగృహంలో ఏర్పాటుచేసిన కేక్‌ను పెద్దిరెడ్డి చే కట్‌చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ చౌడేపల్లె, పుదిపట్ల, చారాల, పందిళ్లపల్లె, మేకలచిన్నేపల్లె తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలను అభివృద్దిచేయడం, పందిళ్ళపల్లె, పుదిపట్ల, మర్రిమాకులపల్లె, కాటిపేరి, యల్లంపల్లెతోపాటు పలు గ్రామాల్లో ఆలయాలను నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. దామోదరరాజు ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. దామోదరరాజు మాట్లాడుతూ పేదలకు సేవచేయడం నాఅధృష్టమన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ల సహకారంతో మండలాభివృద్దికి తన వంతు కృషిచేస్తానని తె లిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామమూర్తి, వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌,కాంట్రాక్టర్‌ ఎన్‌డి. పవన్‌కుమార్‌రాజు , సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలు పాల్గొన్నారు.
 
Tags; Damodarraju’s services are commendable

Natyam ad