మహిళలతో అప్యాయ పలకరింపు – రెండవ రోజు కాలినడకన ఎంపీ పర్యటన

పుంగనూరు ముచ్చట్లు:
 
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటిలో రెండవ రోజు మంగళవారం వార్డుబాట కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ స్వయంగా ప్రతి ఇంటిలోనికి వెళ్లి మహిళలకు అభివాదం చేస్తూ సమస్యలను సావదానంగా స్వీకరించారు. ఎలాంటి ఒత్తిడిలు లేకుండ మహిళలతో చర్చించారు. చిన్నారులతో ముచ్చటించారు. అలాగే వ్యక్తి గత సమస్యలను సైతం ఎంపీ మహిళలను అడిగి తెలుసుకోవడంతో మహిళల ఆనందానికి హద్దులు లేకుండ పోయింది. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేయడం, లెటర్లు ఇవ్వడం చేశారు. మహిళా దినోత్సవం రోజున ఎంపీ కొత్త పంథాలో పర్యటన కొనసాగించారు. మున్సిపాలిటిలో రెండవ రోజు ఎంపీ పర్యటనలో ప్రతి గడప తొక్కుతూ, ఇంటింటికి వెళ్లారు. ఎంపీ మిధున్‌రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఆ వార్డు కౌన్సిలర్లు అమ్ము, సాజిదా తోకలసి చంద్రకాంత్‌వీధి, గోకుల్‌వీధి, పోలీస్‌వీధి, ఉబేదుల్లాకాంపౌండు, రహమత్‌నగర్‌, ఏటిగడ్డపాళ్యెం, ఎంబిటి రోడ్డు, చెంగాలపురం, మోతినగర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారులను, పిఏలను నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. పెన్షన్లు, రుణాలు, ఇండ్లు మంజూరు చేయాలని, మురుగునీటి కాలువలు నిర్మించాలని ఎంపీని కోరారు. మున్సిపాలిటిలోని మెప్మాకి చెందిన ఆర్పీలు, సీవోలు, మహిళా నేతలు ఎంపీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈయన వెంట ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, రాష్ట్ర కురబ సంఘ అధ్యక్షుడు జబ్బాల శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, పార్టీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ పర్యటించారు.
పార్కు స్థలానికి భూమి పూజ …
పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌లో మున్సిపల్‌ స్థలంలో పార్కు, జిమ్‌సెంటర్‌ నిర్మాణానికి ఎంపీ మిధున్‌రెడ్డి , చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సుమారు రూ.20 లక్షలతో నిర్మించనున్న పార్కు, జిమ్‌ సెంటర్‌ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ తెలిపారు.
9 న ఎంపీ పర్యటన ఇలా …
రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి బుధవారం మూడవ రోజు పర్యటిస్తారని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. పట్టణంలోని మేవెంకటస్వామివీధి, కుమ్మరవీధి, బజారువీధి, తేరువీధి, సుబేదారువీధి, బ్రాహ్మణవీధి, షరాఫ్‌కట్‌వీధి, రాతిమసీదువీధి, నానబాలవీధి, ఉర్ధూస్కూల్‌వీధి, ఎంబిటి రోడ్డు, తాజ్‌నగర్‌, మంచాలవారివీధి, స్టాన్లీనగర్‌ ప్రాంతాలలో పర్యటిస్తారని ఆయన తెలిపారు.

Tags: Danger greeting with women – second day MP tour on foot
 

Natyam ad