పుంగనూరులో అప్యాయంగా …పథకాల గూర్చి ఆరాతీసిన మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

అప్యాయంగా ….అమ్మా…మీ ఇంటికి ఎన్ని లక్షలు వచ్చింది …ఎన్ని పథకాలు వచ్చాయ్‌…సుమారు మూడు లక్షలు అందిందా… సంతోషంగా ఉన్నారా…పథకాలు ఏమైనా రాకపోయినా , ఇవ్వకపోయినా చెప్పండి వెంటనే చర్యలు తీసుకుంటా….ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మిమ్మలను కలుసుకుని కష్టసుఖాలు తెలుసుకునేందుకే వచ్చాం అంటు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులతో, వికలాంగులతో మాట్లాడారు. బుధవారం మండలంలోని బోడేవారిపల్లెలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, టీటీడీ మెంబరు పోకల అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డికి మహిళలు మంగళ నీరాజనాలు పలికారు. మంత్రి ఇంటిఇంటికి వెళ్లారు. సమస్యలపై ఆరా తీశారు. ఎలాంటి సమస్యలైనా తక్షణం పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ చంద్రహాస్‌, వైస్‌ ఎంపీపీ ఈశ్వరమ్మ, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, పార్టీ నాయకులు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, జయరామిరెడ్డి, అమరనాథరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రామకృష్ణారెడ్డి, జయనారాయణరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, చెంగారెడ్డి, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Danger in Punganur … Minister Peddireddy inquired about the schemes

Post Midle
Natyam ad