దర్జాగా ….అక్రమ మొరం దందా…

సుల్తానాబాద్ ముచ్చట్లు:
మండలంలో అక్రమార్కులు తాకిడికి పచ్చదనంతో కళకళలాడాల్సిన గుట్టలు కనుమరుగై పోతున్నాయి. గుట్ట పక్కన ప్రభుత్వ భూముల నుండి దర్జాగా త్రవ్వేస్తు మొరం మాఫియా సొమ్ము సంపాదించుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యదేచ్చగా మొరం తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ సంపద కొల్లగొడుతున్నారు. అక్రమ దందాలు అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. సుల్తానాబాద్ మండలం కొమండ్ల పల్లి గుట్ట చుట్టూ ఇష్టారాజ్యంగా అధికారుల అండదండలతో జెసిబి తో మొరం తోడేస్తున్నారు. టిప్పర్ల లో మొరం తరలిస్తూ సొమ్ము చేసు కుంటున్న పట్టించుకునే దిక్కు దివానా లేరని ,పగలనక రాత్రనక టిప్పర్లు రెవెన్యూ కార్యాలయం ఆవరణలో తిరుగుతుంటే స్థానికులు మండిపడుతున్నారు. గుట్ట నుండి  ప్రభుత్వం భూమి నుండి చెరువు నుండి మొరం చేయాలంటే తప్పనిసరిగా రెవెన్యూ శాఖ నుండి మైనింగ్ శాఖ అధికారుల నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ  ఇక్కడ అనుమతులు లేవు. భవన నిర్మాణ అనుమతుల పేరుతో అక్రమంగా మొరం జెసిబి తోడేస్తున్నారు గుట్టల ఆనవాలు లేకుండా చేస్తున్నారు ఇంత జరిగినా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి మొరం తవ్వకాలతో ప్రభుత్వానికి గండి పడుతున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఈ తతంగమంతా అధికారుల కనుసైగ లో నడుస్తుందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా  మొహం త్రవ్వకాలు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
Tags:Darjaga …. Danda illegal moram

Natyam ad