శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి దర్శనం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా ఆరో రోజైన మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.కాగా చివరి రోజు కూడా శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేసి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. బుధవారంతో తెప్పోత్సవాలు ముగియనున్నాయి.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటి ఈవో రాజేంద్రుడు, ఏఈవో రవికుమార్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ఎపి.శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్లు నారాయణ, వెంకటాద్రి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కామరాజు పాల్గొన్నారు.
Tags: Darshan of Sri Govindarajaswamy with Sridevi and Bhudevi