శ్రీ కృష్ణస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి దర్శనం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.కాగా ఐదవ రోజైన ఫిబ్రవరి 14న శ్రీ గోవింద రాజ స్వామి వారిని వేంచేపు చేసి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో రవికుమార్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ఎపి. శ్రీనివాస దీక్షితులు, సూపపరింటెండెంట్లు నారాయణ, వెంకటాద్రి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కామరాజుపాల్గొన్నారు.
Tags: Darshan of Sri Krishnaswamy and Sri Andal Amma