మహిళా అభివృద్ధికి సీఎం పెద్ద పీట-ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి.

-లబ్ధిదారులతో ఎమ్మెల్యే సెల్ఫీ.
పెద్దపెల్లి     ముచ్చట్లు:
 
మూడురోజుల మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ తో పాటు ప్రభుత్వ ఇతర సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల తో తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పాలిట దైవంగా మారాడని లబ్ధిదారులు పేర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళా అభివృద్ధికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారని కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 10 లక్షల కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు లక్ష నూట పదహారు రూపాయలు అందించారన్నారు. కెసిఆర్ కిట్ల పథకం ద్వారా 11 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో బీడీ కార్మికులకు అందించిన పెన్షన్ ను సీఎం కేసీఆర్ పదింతలు పెంచారన్నారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు మాధవి, తెరాస పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ తోపాటు కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ తో పాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు.
 
Tags:Dasari Manohar Reddy, MLA, is the Chief Minister for Women’s Development

Natyam ad