ప్రియుడు కోసం కూమర్తె  హత్య.

కడప ముచ్చట్లు:
నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి.. కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్నపేగును తుంచేసింది. మాతృత్వాన్ని పంచాల్సిన హృదయంతో కూతురి హత్యకు పథకం రచించింది. ప్రియుడితో కలిసి కన్నబిడ్డ గొంతు నులిమి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసింది. తండ్రి ప్రవర్తన నచ్చక మనస్తాపంతో ఎటో వెళ్లిపోయిందని నమ్మించింది. వారి సహాయంతో చుట్టుపక్కలా వెతికించింది. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. రెండు రోజుల తర్వాత బావిలో మృతదేహం లభ్యమైంది. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. కన్నతల్లే కూతురిని హత్య చేసినట్లు తేలింది. నిందితులను అదుపులోకి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారిని అరెస్టు చేశారు.కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామంలో వెంకటయ్య, రమణమ్మ దంపతులు నివాసముంటున్నారు. వారి కుమార్తె ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. రమణమ్మ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసుకున్న కుమార్తె తల్లిని మందలించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రమణమ్మ తమకు అడ్డుగా ఉన్న కుమార్తెను హత్య చేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో పాటు సమీప బంధువైన మరో వ్యక్తితో కలిసి హత్యకు ప్రణాళిక రచించింది. అందరూ కలిసి గతేడాది అక్టోబర్‌ 16న ఇంట్లో నిద్రపోతున్న యువతి గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి బావిలో పడేశారు.తండ్రి మద్యానికి బానిసవడంతో తీవ్ర మనస్తాపానికి గురై.. యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిందని స్థానికులను నమ్మించింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం వరకు చదివి కుటుంబ సహకారం లేక వెంకట సుజాత చదువు చాలించింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని, అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తల్లి అందరికీ చెప్పింది. ఈ విషయంపై పోలీసులకూ ఫిర్యాదు చేసింది. యువతి కోసం గాలింపు చేపట్టగా రెండు రోజుల తర్వాత గ్రామ శివారులోని బావిలో మృతదేహం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కారణంతో.. తానే కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకుంది. తనతో పాటు మరో ఇద్దరు ఈ దారుణంలో పాలు పంచుకున్నారని తెలిపింది. దీంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
 
Tags:Daughter murdered for boyfriend

Natyam ad