Davos WEF Chandrababu Naidu ktrlokesh

చంద్రబాబు, కేటీఆర్‌ ఫొటో పోజు అదుర్స్‌

సాక్షి

Date :23/01/2018

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఎకనామిక్‌ ఫోరంలో తెలుగు నేతలు సందడి చేశారు. కనిపించిందే తడవుగా నవ్వుతూ ఒకరినొకరు సరదాగా పలకరించుకున్నారు.  అనంతరం కెమెరాలకు పోజులిచ్చారు. ముఖ్యంగా ప్రాంతాలు విడిపోయిన తర్వాత తమ తమ రాష్ట్రాల్లో ఒకరినొకరు పలకరించుకునేందుకు కూడా తీరికలేనంతగా గడిపేస్తున్న వారు ఓ సుదూర ప్రాంతంలోని వేదిక ద్వారా తారసపడటంతో వారి మధ్య నవ్వులు విరిశాయి.

యోగక్షేమాల సమాచారం బదిలీ అయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు మంత్రి తారక రామారావు (కేటీఆర్‌) డబ్ల్యూఈఎఫ్‌లో ప్రధాన ఆకర్షణగా కనిపించారు. వారు ఒకరినొకరు పలకరించుకొని కబుర్లు పెట్టుకుంటూ ఫొటోలకు పోజులిచ్చారు. అంతేకాదు, నారా చంద్రబాబు తనయుడు లోకేశ్‌, ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా కేటీఆర్‌ను కలిసి సరదాగా ఫోటోలు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *