పుంగనూరులో నాడు-నేడుతో మారిన పాఠశాలలు

పుంగనూరు ముచ్చట్లు:
 
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు – నేడు పనులతో పాఠశాలల రూపురేఖలు మారి కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తోందని సమగ్రశిక్షణా అడిషినల్‌ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌ వెంకట్రమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన, నియోజకవర్గ నాడు-నేడు పాఠశాలల ఇన్‌చార్జ్ అజయ్‌కుమార్‌రెడ్డి , ఎంఈవో కేశవరెడ్డితో కలసి పనులను పరిశీలించారు. మండలంలోని అడవినాథునికుంట మోడల్‌స్కూల్‌లో జరుగుతున్న పనులను , మధ్యాహ్న భోజన పథకాన్ని, రికార్డులను పరిశీలించారు. అలాగే బసవరాజ ప్రభుత్వ హైస్కూల్‌లో పనులను , భోజన పథకాన్ని పరిశీలించారు. అలాగే ఎంఆర్‌సీ భవనాన్ని , భవిత కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ మండలం, మున్సిపాలిటిలో నాడు-నేడు తొలివిడత క్రింద 41 పనులకు రూ.9.87 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయడం అభినందనీయమన్నారు. అలాగే రెండవ విడత కార్యక్రమానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోదన , వసతులు కల్పించడం జరిగిందన్నారు. ఫలితాలు కూడ ఊహించని రీతిలో రావడం జరుగుతుందని ఆశాబావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమా, హెచ్‌ఎం వెంకట్రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Day-to-day changed schools in Punganur

Natyam ad