Deadly road accidents ..14 dead

ఘోర రోడ్డు ప్రమాదాలు..14మంది దుర్మరణం

Date: 13/01/2018

సాక్షి

సాక్షి, పుణె: రెండు వేర్వేరు ప్రమాదాల్లో 14మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని కడెగావ్‌ సమీపంలోని సంగ్లీలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్ల్లోకి వెళితే…రెజలర్స్ పోటీలో పాల్గొని పుణె నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్న ఢీకొట్టడంతో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు రెజలర్స్‌తో పాటు డ్రైవర్‌ కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మితిమిరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags: Deadly road accidents ..14 dead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *