లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

పలమనేరు ముచ్చట్లు:
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిన చెక్కులను రాష్ట్ర బారీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని వికోట,బైరెడ్డిపల్లె,పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి మండలాలకు చెందిన లబ్ధిదారులకు స్థానిక తెదేపా కార్యాలయంలో ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 22 మంది లబ్ధిదారులకు సుమారు రూ.21.50 లక్షలను సీఎం సహాయనిధి మంజూరైందని చెప్పారు. సీఎం సహాయ నిధినుంచి ఇప్పటివరకు 379 మందికి రూ. 3.52 కోట్ల వరకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంత్రి అమరనాథ్ రెడ్డి చొరవతో చెక్కులను తెప్పించినట్టు ఆమె పేర్కొన్నారు. అదేవిదంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందిన నియోజకవర్గాలలో పలమనేరు నాల్గవ స్థానంలో ఉందని ఆమె వివరించారు.‌ అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆసరాగా నిలిచిందన్నారు. తెదేపా సేవలను గుర్తించి ప్రజలు ప్రభుత్వానికి మద్దతు తెలపాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు గీత,మురళి,మంజులమ్మ,మునిరత్నం, జడ్పీటీసీలు రాధాకిషోర్,సోమశేఖర్,శమంతకమణి,నాయకులు ఆర్వీ బాలాజి,ప్రసాద్ నాయుడు, బాలాజి నాయుడు, కిషోర్ గౌడు,కదిరప్ప,హరిబాబు,వెంకట్రమణారెడ్డి,మురహరిరెడ్డి,సుబ్రమణ్యం శెట్టి,క్రిష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
Tag : Delivering check assistant checks to beneficiaries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *