ఇళ్లు కూల్చివేత…

మచిలీపట్నం  ముచ్చట్లు:
 
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. కూల్చివేతల నేపధ్యంలో రెవిన్యూ అధికారులు, భారీగా పోలీసుల మోహరించారు. బలవంతంగా పేదల ఇళ్ళు కూల్చివేస్తున్నారని బాధితులు పెట్రోల్ పోసుకుని ఆత్మహ త్య చేసుకునేందుకు యత్నం చేసారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడే జీవిస్తున్నాం.. కరెంటు, నీటి వసతి లేకున్నా మాబ్రతుకులు ఈడ్చుకుం టున్నామని వారు అన్నారు. పుస్తెలు తాకట్టు పెట్టుకుని ఇక్కడ ఇళ్ళు నిర్మించుకున్నాం. ఉన్నపళంగా కాళీచేసి వెల్లమంటే మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. నిర్వాసితులను పోలీసులు అరెస్టు చేసి పొలీస్ స్టేషన్ కు తరలించారు. తరువాత జె.సి.బిల సహాయంతో ఇళ్ల కూల్చివేతను  ప్రారంభించారు.
 
Tags:Demolition of houses

Natyam ad