ప్రతీ ఆస్తికి ఆధారే

Date:19/06/2018
నల్గొండ ముచ్చట్లు:
గృహాలు.. వాణిజ్య సదుపాయాలు.. ఇలా ప్రతీది ఆధార్ సంఖ్యతో అనుసంధానిస్తున్నారు. పారదర్శకతకు పెద్దపీఠ వేయడంతోపాటు అక్రమాల నిరోధం.. అక్రమ ఆస్తుల బాగోతానికి అడ్డుకట్ట వేయవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీల పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు 60,029 మంది ఉండగా.. మే నెలాఖరు నాటికి ఆయా మున్సిపాలిటీల్లో 18,682 ఆధార్ కార్డుల అనుసంధాన ప్రక్రియ పూర్తయ్యింది. పురపాలికల్లో ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన ఇళ్లకే పన్ను విధించి ఏడాది లో రెండు పర్యాయాలు అధికారులు పన్ను వసూలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలికాలంలో ఖాళీ స్థలాల క్రమబద్ధ్దీకరణ ప్రక్రియ పూర్తవ్వడంతో యజమానులు ఖాళీ స్థలాలకు సైతం ఏడాదికి ఒకమారు విధిగా పన్ను చెల్లించాల్సి వస్తోంది. అయితే చాలామంది ఇళ్ల, ప్లాట్ల యజమానులకు తమ ఇంటి సంఖ్య లేదా తమ ఆస్తి పన్ను క్రమబద్ధ్దీకరణ నంబర్ తెలియక పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు.ఆధార్‌తో ఆస్తులను అనుసంధానం చేయడం ద్వా రా ఈ తరహా ఇబ్బందులకు ఇకపై ఆస్కారం ఉండబోదు. అంతేకాకుండా ఆధార్ అనుసంధానంతో పట్టణంలో ఆస్తు ల వివరాలు, లెక్కా పద్దులు సైతం పక్కాగా నమోదు అవుతాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే బ్యాంకు, ఖాతాలకు, వంటగ్యాస్ కనెక్షన్లు, ఓటరు కార్డుకు.. ఇలా ప్రతి దానికీ ఆధార్‌ను అనుసంధానించింది. ఈ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ పౌరసేవలన్నింటినీ ఈవోడీ కిందకు తెచ్చి పౌరులు వివిధ పన్నులను ఆన్‌లైన్లో చెల్లించడంతోపాటు, సేవలను ఆన్‌లైన్లో పొందేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా.. స్థిరాస్తులకు సైతం ఆధార్‌ను అనుసంధా నం చేసే ప్రక్రియను చేపట్టింది. నల్లగొండ పురపాలిక పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపుదారులు 31,321 మంది ఉండ గా మే నెలాఖరు నాటికి 8,424 ఆధార్ కార్డులను అనుసంధానించారు. అలాగే మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 22,407 ఆస్తి పన్నుదారులకు సంబంధించి 8,378 ఆధా ర్ నంబర్ల అనుసంధాన ప్రక్రియ పూర్తయ్యింది. దేవరకొం డ మున్సిపాలిటీ పరిధిలో 6,301 ఆస్తి పన్నుదారులకు చెందిన 1,880 ఆధార్ నంబర్లను అనుసంధానించారు.
Tags:Depending on each property

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *