ఉద్యోగ సంఘాలు- ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం వివరాలు

అమరావతి ముచ్చట్లు:
 
ప్రత్యేక జీవో ద్వారా త్వరలో పీఆర్సీ నివేదిక విడుదల..
గతంలో ప్రకటించిన విధంగా ఫిట్‌మెంట్‌ 23 శాతం కొనసాగింపు
50 వేల లోపు జనాభా ఉంటే …
రూ.11 వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్‌ఆర్‌ఏ
50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే…
రూ.13 వేల సీలింగ్‌తో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ
2 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉంటే…
రూ.17 వేల సీలింగ్‌తో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ
13 జిల్లా కేంద్రాలకు ఇదే స్లాబు వర్తింపు..
ఈ జనవరి నుంచి అమలు
50 లక్షలకు పైబడి జనాభా ఉంటే …
రూ.25 వేల సీలింగ్‌తో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ
సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో…
2024 జూన్‌ వరకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ
రిటైర్డ్‌ ఉద్యోగుల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌…
70–74 ఏళ్ల వారికి 7 శాతం, 75–79 ఏళ్ల వారికి 12 శాతం
2022 జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు..
మధ్యంతర భృతి రికవరీ ఉపసంహరణ
వేతన సవరణ పరిమితి ఐదేళ్లే..
అంత్యక్రియల ఖర్చు రూ.25 వేలు
పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు
ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల
సీపీఎస్‌ను పరిశీలించేందుకు కమిటీ ఏర్పా టు..
2022 మార్చి 31 నాటికి రోడ్‌ మ్యాప్‌
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు..
ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగుల అంశంపై ఇందులోనే పరిశీలన
మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌కు …
సంబంధించి త్వరలో ఉత్తర్వులు
ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ స్కీమ్‌ క్రమబద్ధీకరణకు చర్యలు
2022 జూన్‌ 30లోపు గ్రామ, వార్డు …
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు.
అప్పటి నుంచి స్కేల్స్‌ వర్తింపు.
 
Tags; Details of the agreement reached between the unions and the government

Natyam ad