Detention checks in Nandivani

నందనవనంలో నిర్బంధ తనిఖీలు

Date: 10/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

నగరంలోని మీర్‌పేట్ నందనవనంలో పోలీసులు ఈ తెల్లవారుజాము నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో పోలీసులు సరైన పత్రాలు లేని 25 బైక్‌లు, 2 కార్లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నలుగురు పాతనేరస్తులు, ముగ్గురు రౌడీషీటర్లను అరెస్ట్ చేశారు. వీరితో పాటు 15 మంది అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags: Detention checks in Nandivani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *