Development expected in the third ward

మూడవ వార్డులో ఆశించిన అభివృద్ధి

– నిరంతర ప్రజల సేవలో అమ్ము
– ఉత్తమ వార్డుగా అవార్డు

Date:21/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

నాలుగున్నరేళ్ల వైఎస్‌ఆర్‌సిపి మున్సిపల్‌ పాలనలో పట్టణ మూడవ వార్డులో అభివృద్ధి పూర్తి స్థాయిలో జరిగింది. ఇక్కడ సుమారు 1750 మంది ఓటర్లు , మూడువేల మంది జనాభా మేధావి వర్గం ఉన్న వార్డు కావడంతో ఇక్కడ కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం కష్టతరం. అలాంటి వార్డు కౌన్సిలరు పదవికి వైఎస్‌ఆర్‌సిపి తరపున పోటీ చేసి అమ్మును రంగంలోనికి దించి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిపించారు. అమ్ము అంజుమన్‌ కమిటి సెక్రటరీగా పని చేస్తున్నారు. ఉదయం 5 గంటల నమాజ్‌ పూర్తి చేసుకుని , వార్డు పర్యటన చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డు ప్రజల భాగోగులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ, పట్టణ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఉత్తమ వార్డుగా అవార్డులు అందుకున్నారు. వార్డులో ఎల్‌ఈడి దీపాలు ఏర్పాటు చేసి, వార్డులోని ట్రాన్స్ఫార్మర్లకు కంచెలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి రోజు మార్చి రోజు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు అగ్రస్థానం కల్పించారు. తడిచెత్త, పొడిచెత్త వేరుచేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించడం, ప్లాస్టిక్‌ కవర్ల నిషేధాన్ని ఈ వార్డులో పకడ్భంధిగా అమలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిల సూచనల మేరకు చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌, కమిషనర్‌ కెఎల్‌.వర్మ సహకారంతో ఈ వార్డును అభివృద్ధి చేశామని , అభివృద్ధికి సహకరించిన వారికి కౌన్సిలర్‌ అమ్ము కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్‌వోఆర్‌ ప్లాంటు…

వార్డులోని ఉబేదుల్లాకాంపౌండులో ఆర్‌వోఆర్‌ ప్లాంటును రూ. 7 లక్షలు ఖర్చు చేసి, మాజీ ఎంపి మిధున్‌రెడ్డి ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 400 మందికి సురక్షిత మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. కౌన్సిలర్‌ అమ్ము ఆధ్వర్యంలో టోకెన్లు పంపిణీ చేశారు. ప్రతి రోజు పద్దతి ప్రకారం టోకెన్లతో మంచినీరును తీసుకెళ్లే విధానం ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలు పొందుతున్నారు.

వెహోక్కలు నాటడం….

వార్డులోని ఉబేదుల్లాకాంపౌండు, పోలీస్‌లైన్‌, గోకుల్‌వీధి, చంద్రకాంత్‌వీధి, గోకుల్‌ విస్తర్ణ ప్రాంతాలలోని అన్ని రహదారులలోను సుమారు రెండు వేల వెహోక్కలు నాటించి, ట్రీగార్డులు ఏర్పాటు చేసిన ఘనత కౌన్సిలర్‌ అమ్ముకు దక్కింది. అలాగే ప్రజల ఆరోగ్యంకోసం రూ.10 లక్షలతో పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచారు. అలాగే కూరగాయల మార్కెట్‌కు షెడ్లు వేసేందుకు ప్రతిపాదనలు పంపారు.

అభివృద్ధి కార్యక్రమాలు….

వార్డులోని ఉబేదుల్లాకాంపౌండులోని ఆరువీధుల్లోను రోడ్లు, కాలువలు, పైపులైన్లు వేశారు. అలాగే చంద్రకాంత్‌వీధిలో రోడ్డు, పైపులైన్లు వేశారు. అన్ని ప్రధాన వీధులకు రోడ్లు, పైపులైన్లు సుమారు కోటిరూపాయలు ఖర్చు చేసి, ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గోకుల్‌ విస్తర్ణ ప్రాంతానికి రూ.40 లక్షలు కేటాయించారు. వార్డుల్లోన్ని అన్ని ప్రాంతాలకు స్టీలు పైపులతో నామఫలకాలు ఏర్పాటు చేశారు. కూరగాయల మార్కెట్‌ మినహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలలోను ప్రథమ స్థానంలో నిలిచారు.

పెన్షన్లు, రుణాలు…

మహిళలకు అన్ని రకాల పెన్షన్లు కలిపి 190 మందికి ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు. 8డ్వాక్రా గ్రూపులకు రుణాలు, ఎస్సీ, ఎస్టీలకు ఇద్దరికి ఆటో రుణాలు, 15 మంది మైనార్టీలకు ఒకొక్కరికి రూ.2లక్షలు చొప్పున రుణాలు, 17 మందికి గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేయించారు.

ఇలా పని చేస్తే చాలు….

మావార్డులో ప్రజలకు ఇచ్చిన హామిలు నేరవేర్చారు. అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం మాకు ఎలాంటి సమస్యలు లేవు. కూరగాయల మార్కెట్‌కు షెడ్లు ఏర్పాటు మాత్రం మిగిలింది.ఈ షెడ్లు ఏర్పాటు చేస్తే కూరగాయల వ్యాపారులతో పాటు ప్రజలకు సమస్య ఉండదు. రోడ్డుపై దుకాణాలను షెడ్లలో పెట్టుకోవడంతో ట్రాఫిక్‌ సమస్య తీరిపోతుంది.

– ఎస్‌.షామీర్‌బాషా, కూరగాయల వ్యాపారి. పుంగనూరు.

అభివృద్ధి ఊహించలేదు….

మూడవ వార్డులో అభివృద్ధిని మేము ఊహించలేదు. వార్డు సమస్యలను తీర్చడంలో కౌన్సిలర్‌ , పాలకవర్గం కృషి ప్రశంసనీయం. వార్డులో ఉచిత మంచినీటి సరఫరా చేస్తున్న మాజి ఎంపి మిధున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా కుటుంబాలకు నీటి కష్టం తీరింది. వైఎస్‌ఆర్‌సిపి పార్టీకి మేము అండగా నిలుస్తాం..

– ఎస్‌.సాధిక్‌బాషా, చింతపండువ్యాపారి. పుంగనూరు.

23న నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు

 

Tags; Development expected in the third ward

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *