పక్కా ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యం

-కొత్తగూడెం నుండే పోటీ అన్న జలగం
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
 
పక్కా ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సెంట్రల్ పార్క్ ముందున్న మామిడి తోటలో ఇటీవల నిర్వహించిన  చిట్ చాట్ కార్యక్రమంలో జలగం వెంకటరావు పాల్గొని విలేకరులతో మాట్లాడారు. ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ముందు ప్రణాళిక రచించాలని దాని ఆధారంగా ముందుకు పోతే అభివృద్ధి కనబడుతుందని పేర్కొన్నారు. గతంలో కొత్తగూడెం నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుగా పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకొని దానికి అనుగుణంగా అభివృద్ధి పనులకు గాను నిధులు కేటాయింపు జరిగే విధంగా ముందుకు పోయినట్లు పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సిన వైద్యం విద్య ను దృష్టిలో పెట్టుకొని పని చేసినట్లు చెప్పారు. పాత కొత్తగూడెంలో కేజీ టు పీజీ విద్యను అందించాలనే లక్ష్యంతో భవన సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు.  పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. కిన్నెరసాని ప్రాజెక్టు ఆవరణలో సంపూర్ణంగా పర్యాటక కేంద్రాన్ని మార్చేందుకు కూడా ప్రణాళికను సిద్ధం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు. ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపంలో సెంట్రల్ పార్క్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పార్క్ ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాటర్ స్కీములు, రోడ్లు తన హయాంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతులకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేసినట్లు వివరించారు.  ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని సమకూర్చేందుకు ముందుగా ప్రణాళిక రచించుకుంటేనే అది సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు స్పష్టం చేశారు.
 
 
రానున్న ఎన్నికల్లో కొత్తగూడెం నుండే పోటీ..
రానున్న ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుండే పోటీ చేయడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు సైతం చిత్తశుద్ధితో అమలు చేయడంతో పాటు ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అదేవిధంగా తన వంతు కృషి చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల బరిలో దిగే ముందు అభివృద్ధికి కావాల్సిన స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరుగుతుందని వివరించారు. ప్రజలు ఎప్పుడూ అభివృద్ధినే చూస్తారని అట్టి అభివృద్ధిని గతంలో చేయడం జరిగిందని పేర్కొన్నారు.  ప్రజలు ఎన్నుకుంటే వారికి కావాల్సిన ప్రధానమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని జలగం వెంకటరావు అన్నారు.  తాను గతంలో చేసిన అభివృద్ధి మంత్రంతో నే రానున్న ఎన్నికల్లో నిలబడతానని జలగం తెలిపారు.
 
Tags: Development is possible with a definite plan

Natyam ad