కొత్త ఉద్యోగాలతో అభివృద్ధి-మంత్రి ఇంద్రకరణ్..

హైదరాబాద్ ముచ్చట్లు:
ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ను కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. తరువాత అయన మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వంగా టీఆర్ఎస్ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
కొత్త  ఉద్యోగ నియామకాలతో మరింత సర్వతోముఖాభివృద్ధి వైపు రాష్ట్రం సాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే యువత  కల సాకారం కానుంది. ఎంతో మంది నిరుద్యోగులకు సీఎం ప్రకటన కొత్త ఆశలు చిగురింపజేసిందని అన్నారు.
ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి  సూచించారు. అంతే కాకుండా ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించడం సీయం కేసీఆర్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు.
 
Tags:Development Minister Indira Gandhi with new jobs

Natyam ad