తిరుమలకు వచ్చు భక్తులు దళారుల మాట నమ్మి మోసపోకండి

-టి.టి.డి వెబ్ సైట్ లనే ఉపయోగించుకోవాలి
-17 మంది దళారులపై హిస్టరీ షీట్స్ ఓపెన్
-జిల్లా యస్.పి   వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్.
 
తిరుపతి  ముచ్చట్లు:
 
 
పోలీసుల దృష్టి వెంకన్న స్వామి భక్తుల పరిరక్షణపై పడింది. ఫలితంగా తిరుమల స్వామివారి దర్శనానికి టికెట్లను అమ్ముతాం అంటున్నా 39 ఫేక్ వెబ్సైట్లను (మోసపూరిత) గూగుల్ నుంచి తొలగింప చేశారు. జిల్లా యస్.పి   వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఇది సాధ్యపడింది.గూగుల్ యాజమాన్యంతో మాట్లాడి, ఫేక్ వెబ్సైట్ల వివరాలు తెలుసుకొని వాటిని గూగుల్ నుంచి తొలగించారు.కేవలం వెంకన్న స్వామి మీద ఉన్న అపార విశ్వాసంతో దేశం నలుమూలల నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తులు మోసానికి గురి కాకుండా ఉండేందుకు అర్బన్ పోలీసు విభాగం ప్రత్యేక చర్యలకు పూనుకుంది.దీని ఫలితంగానే ఫేక్ వెబ్సైట్ లను గూగుల్ నుంచి తొలగించడమే కాకుండా 17 మంది దళారులను అరెస్టు చేసి వారిపై సస్పెక్ట్ షీట్ లను ఓపెన్ చేయడం జరిగింది.
 
 
 
ఇకపై తిరుమలలో ఎలాంటి మోసపూర్తి ఘటనలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు. కేసు నమోదైన వెంటనే త్వరితగతిన దర్యాప్తు చేసి ముద్దాయిలకు శిక్ష పడే విధంగా చర్యలు.ఈ సందర్భంగా జిల్లా యస్.పి  వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్  మాట్లాడుతూ ఇకపై దళారులు పట్టుబడితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.భక్తులకు సూచనలు ఇస్తూ, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే సేవా టికెట్లు ఇతరత్రా కొనుగోలు చేయాలని కోరారు.స్వామివారి సేవకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సంక్షేమం వారి భద్రతే ప్రధానమని భావించి పోలీసు విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు.తిరుమల వెంకన్న స్వామి పేరుతో ఇటీవల మోసాలు పెరుగుతుండడంతో దీనిపై పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెట్టిందని తిరుమలకు వచ్చు భక్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడం జరుగుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో తిరుమల అడిషనల్ యస్.పి/డి.యస్.పి ప్రభాకర్ బాబు గారు, సి.ఐ లు I టౌన్ జగన్ మోహన్ రెడ్డి, డి.సి.ఆర్.బి రాఘవన్, ఈస్ట్ శివ ప్రసాద్ రెడ్డి, II టౌన్ చంద్ర శేఖర్, యస్.ఐ లు రమేష్, వెంకట చిన్న, ప్రకాష్ పాల్గొన్నారు.
దాడులను అరికట్టాలి
Tags: Devotees who come for massage should not be deceived by believing the word of the forces

Natyam ad