శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

Date:13/02/2018
కర్నూలు ముచ్చట్లు:
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటి, కాల్వ బుగ్గ తదితర క్షేత్రాలను లక్షలాది భక్తులు దర్శించి తరించారు. స్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పటికే ఆయా క్షేత్రాల్లో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య  గ్రామోత్సవానికి తీసుకొచ్చారు. ఉత్సవం ఎదుట కళాకారుల వేషధారణలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. గిరిజనుల నృత్యాలు, గొరవయ్యల ఢమరుక నాదాలు, చెక్క భజనలు, కోలాటాలతో కళాకారులు ఉత్సవం ఎదుట సందడి చేశారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం పుష్కరిణి, శివదీక్ష శిబిరాల్లోని కళావేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పుష్కరిణి వద్ద వద్దిపర్తి పద్మాకర్ ఆధ్యాత్మిక ప్రవచనంలో భాగంగా శివుడి వైభవం, శివరాత్రి మహత్యాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన పేరిణి శ్రీనివాస్ బృందం పేరిణి నృత్య ప్రదర్శనలతో అలరించింది. నందికొట్కూరకు చెందిన సాయిలిఖితశ్రీ సంప్రదాయ నృత్యప్రదర్శనతో సమ్మోహనపరిచారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులు కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్నారు. శివదీక్షా శిబిరాల్లో కర్నూలుకు చెందిన పార్వతీదేవి ప్రవచనం, గాయత్రి గాత్రకచేరీలతో భక్తిభావాన్ని కలిగించారు. పలువురు కళాకారులు నృత్య ప్రదర్శనలు, కిరాతార్జున నాటక ప్రదర్శనలతో అలరించారు.
Tags: Devotees who have fallen to Srisailam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *