Dharna in front of my boyfriend

ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా

Date : 07/12/2017
శాలిగౌరారం ( నల్గోండ జిల్లా) ముచ్చట్లు:
తనను మూడు సంవత్సరాలుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని, పెళ్లి చేసుకోమంటే నిరాకరించాడని ఆరోపిస్తూ ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. శాలిగౌరారం మండలం ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన గాజుల నాగరాజు(20), అదే గ్రామానికి చెందిన గోపాసి మౌనిక (19) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకే సామాజికవర్గం కావడంతో గత మార్చిలో తనను పెళ్లి చేసుకోవాలని మౌనిక కోరగా నాగరాజు నిరాకరించాడు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆసమయంలో ఇరువురి తల్లిదండ్రులు, గ్రామపెద్దల సమక్షంలో వారి పెళ్లి చేసేందుకు ఒప్పించారు. నాటినుంచి నాగరాజు గ్రామంలో కనిపించకుండా పోయాడు.మంగళవారం నాగరాజు గ్రామానికి రావడంతో మౌనిక అతని ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. నాగరాజు తల్లి తమకు రూ.15లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటాడని చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పెళ్లికి నిరాకరించడంతో మౌనిక మంగళవారం నాగరాజు ఇంటి ఎదుట బైఠాయించి కూర్చుంది.తనను నాగరాజు పెళ్లి చేసుకునే వరకు దీక్షను విరమించేది లేదని పేర్కొంది.
Tags : Dharna in front of my boyfriend

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *