గ్రానైట్ కార్మికుల ధర్నా

శ్రీకాకుళం ముచ్చట్లు:
 
శ్రీకాకుళం జిల్లా మేఘ వరం పంచాయతీ పరిధిలో గ్రానైట్ కార్మికులు ధర్నాకు దిగారు. కనీస వేతనాలు ఇవ్వకుండా గిరిజనులను దోపిడీ చేస్తున్నారంటూ  విమర్శిస్తూ ధర్నా నిర్వహించారు గ్రానైట్ కార్మికులు. భద్రతా పరికరాలు సైతం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు యాజమాన్యాలకు మొరపెట్టుకున్నా స్పందన శూన్యం అన్నారు. మేఘ వరం పంచాయతీ పరిధిలో 25 గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రానైట్ క్వారీల అడ్డుకుంటామంటూ గిరిజనుల హెచ్చరించారు. ప్రమాదాలు జరిగినా యజమానులు పట్టించుకోవడం లేదంటూ విమర్శ చేస్తున్నారు బాధితులు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Dharna of granite workers

Natyam ad