Dharna protests against arrest of Indian Ambedkar Sena leaders

భారతీయ అంబేద్కర్ సేన నాయకుల అరెస్టుకు నిరసనగా ధర్నా

DateL09/01/2018

బి.కొత్తకోట ముచ్చట్లు:

నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా భారతీయ అంబేద్కర్ సేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సచిన్ తెలిపారు. ఇందుకు నిరసనగా స్థానిక జ్యోతి బస్టాండు నందు సచిన్ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు 100 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.50 లక్షల బ్యాంకు రుణాలు,5 ఎకరాల భూమిని ఇవ్వాలని సీఎంను కోరినందుకు తమ పార్టీ నాయకులైన గణపతి, సతీష్, సురేంద్రలను రామకుప్పం పోలీసులు అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.అరెస్టు చేసిన దళిత నాయకులను వెంటనే విడుదల చేయాలి, దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగన్న, కె.శ్రీనివాసులు, ఇర్లరమణ, వెంకీ, కదిరప్ప, గోవర్దన్, అన్నమయ్య, మోహన, శంకర, కర్ణ, శ్రీకాంత్, బాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags : Dharna protests against arrest of Indian Ambedkar Sena leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *