Dharna under the guidance of the Modification of War

మాదిగరిజర్వేషన్‌ పోరాటసమితి ఆధ్వర్యంలో ధర్నా

Date: 26/12/2017

పుంగనూరు ముచ్చట్లు:

మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద రాష్ట్ర కార్యదర్శి మిద్దింటి వెంకటస్వామి మాదిగ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మిద్దింటి మాట్లాడుతూ ఎంఆర్పీఎస్‌ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగను తెలంగాణలో అరెస్ట్ చేశారని, ఆయనను విడుదల చేయాలని డిమాండు చేశారు. అలాగే ఏబిసిడి వర్గీకరణ కోసం అఖిలపక్షం ఏర్పాటు చేసి, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదింపచేయాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు రామచంద్ర, నరసింహులు, గంగరాజు, వెంకట్రమణ, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags : Dharna under the guidance of the Modification of War

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *