Dhoni had no grade for any grade contract

ధోనీ ఏ గ్రేడ్‌ కాంట్రాక్టుకు ఎసరు

ఈనాడు.

Date :04/01/2018

దిల్లీ: భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ‘ఎ’ గ్రేడ్‌కు బీసీసీఐ ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది.అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన ధోనీని బీసీసీఐ అగ్రశ్రేణి కాంట్రాక్టులో ఉంచడంపై ఇప్పటికే పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా కాంట్రాక్టులో అతడి పేరును అగ్రశ్రేణి నుంచి తప్పించాలని బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్‌ కమిటీ(సీవోఏ) భావిస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్ల జీతాలు పెంచాలని గత ఏడాది నవంబరు 30న సారథి విరాట్‌ కోహ్లీ, ధోనీతో పాటు కోచ్‌ రవిశాస్త్రి బీసీసీఐ సీవోఏను కోరిన సంగతి తెలిసిందే.దీనిపై కసరత్తులు చేపట్టిన సీవోఏ కొన్ని మార్పులు, చేర్పులతో ఇప్పటికే తుది నివేదిక తయారు చేసిందట. దీన్ని త్వరలో బీసీసీ ఫైనాన్స్‌ కమిటీకి అందజేయనుంది. ఏ ప్లస్‌, ఏ, బీ, సీ ఇలా నాలుగు శ్రేణుల ద్వారా ఆటగాళ్లకు జీతాలు అందజేయాలనుకుంటుంది. ఈ తాజా నివేదికలో ధోనీ తన అగ్రశ్రేణి కాంట్రాక్టును కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టు, వన్డే, టీ20 ఈ మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లను మాత్రమే ఏ ప్లస్‌ శ్రేణిలో చేర్చినట్లు సమాచారం. దీంతో టెస్టులకు విడ్కోలు పలికిన ధోనీ అగ్రశ్రేణి కాంట్రాక్టును కోల్పోక తప్పదు.గతంలో టాప్‌ కాంట్రాక్టులో ఉన్న ఆటగాడికి వేతనంగా ఏడాదికి రూ.2 కోట్లు అందేవి. ఇప్పుడు ఇది భారీ మొత్తంలో పెరిగి రూ.5కోట్లకు పెరిగినట్లు సమాచారం. టెస్టుల్లో మాత్రమే ఆడుతోన్న రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో కొనసాగుతున్నారు. దీంతో వీరికి టాప్‌ కాంట్రాక్టే దక్కనున్నట్లు సమాచారం. ఎవరు ఏ శ్రేణిలో చోటు దక్కించుకుని ఎంతెంత అందుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

Tags : Dhoni had no grade for any grade contract

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *