తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద డయాలసిస్ రోగుల ధర్నా

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రి ముందు డయాలసిస్ రోగులు ధర్నాకు దిగారు.  తిరుపతి ఈఎస్ఐ రోగులకు సంవత్సర కాలము నుండి వారికి కావలసిన మందులు పరికరములు సరఫరా చేయడం లేదు.
గతంలో స్విమ్స్ రెఫర్ చేసేవారు ఈఎస్ఐ ఆస్పత్రి సిమ్స్ వారికి దాదాపు తొమ్మిది కోట్లు బకాయి ఉన్నందున వైద్యము చేయడం లేదు.  బయట మందులు డయాలసిస్ కు ప్యాకెట్స్ కు పరికరాలకు
కొనడానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టే స్థోమత పేద కార్మికులకు లేదు.  అప్పులు చేసి బయట కొనిన రియంబర్స్ ఏళ్ల తరబడి రావడం లేదు మందులు బయట దొరకడం లేదు.  ఈఎస్ఐ ఆసుపత్రి
నందు మందులు లేనందున బయట కొనే ఆర్థిక స్థోమత కార్మికులకు లేనందున బయట మందులు దొరకడం కొనలేకపోవడం అందువలన కొందరు మరణించారని అన్నారు.  వెంటనే మందులు తప్పించి
డయాలసిస్ రోగుల ప్రాణాలను కాపాడ వలసిందిగా సిఐటియు నాయకత్వాన ఈ ఎస్ ఐ ఆస్పత్రి ముందు ధర్నా చేసి సూపరిండెంట్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.   ప్రస్తుతానికి ఒక లక్ష
రూపాయల విలువ చేసే మందులు ఇవ్వడం జరుగుతుందని తొందరలో శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.   ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జి. బాలసుబ్రమణ్యం, సిపిఎం పట్టణ
కార్యదర్శి టి. సుబ్రమణ్యం, సిఐటియు జిల్లా కార్యదర్శి పి. మునిరాజ, బిల్డింగ్ యూనియన్ నాయకులు రాధాకృష్ణ ,ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు చైతన్య, టిటిడి కాంట్రాక్ట్ వర్కర్స్ నాయకులు రఘు,
డయాలసిస్ రోగులు నాగరాజు, పుష్పలత, విష్ణుప్రియ, అలేఖ్య ,బాబు జయ ,ప్రకాష్ నాయక్, ధనలక్ష్మి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Dialysis patients dial at Tirupati ESI Hospital

Natyam ad