హైదరాబాద్‌ టీసీఎస్‌లో 2000 మందిని తొలగించారా?

Date : 29/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ముప్పైవేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నదన్న వార్త కలకలం రేపుతోంది. ఇందులో హైదరాబాద్‌లో రెండువేల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ఇది వ్యయం తగ్గించుకోవడం చేస్తూ, పనితీరును బట్టి తీసివేస్తున్నామని కంపెనీ అధికారులు చెబుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. జూనియర్‌, ట్రైనీ ఉద్యోగులతో పని చేయించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తూ సీనియర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని వారు అంటున్నారు. గత పదేళ్లుగా ఉద్యోగాలలో ఉన్న తమను తొలగిస్తున్నారని కొందరు వాపోతున్నారు. ఇది పారదర్శకంగా జరగడం లేదని, అనైతికంగా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.

Tags ; Did 2,000 out of Hyderabad Teams?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *