ప్రధానిగా దీదీ…

ఇండియా వాంట్స్ మమత’ … పేరిట ప్రచారం

బెంగాల్ ముచ్చట్లు:


జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యాన్మాయ కూటమి ఏర్పాటుకు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్,ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రివాల్ వరకు ఎవరి ప్రయత్నాలు వారి చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ ప్రయత్నాలు ఏవీ ఒక కొలిక్కి రాలేదు. మరోవంక ఈ అందరిని ఇంకొందరినీ ఒకే తాటి మీదకు తీసుకువచ్చి, చక్రం తిప్పేందుకు ఎన్నికల వ్యూహకర్త. ప్రశాంత్ కిశోర్, పట్టువదలని విక్రమార్కునిలా వరసగా, విఫల వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. బీజేపీకి ప్రత్యాన్మాయం సంగతి ఎలా ఉన్నా ఇంతవరకు ప్రధాని మోడీకి ప్రత్యాన్మాయం ఎవరు?2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రత్యర్ధి ఎవరు?  విపక్ష్లాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధి ఎవరు? అంటే క్వశ్చన్ మార్కే సమాధానం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పేరు ప్రచారంలో ఉన్నా, పార్టీ అధ్యక్ష పదవి తీసుకునేందుకే మూడేళ్ళుగా వెనక ముందూ అవుతున్న ఆయన ప్రధాని అభ్యర్ధిగా బరిలో దిగేందుకు అంగీకరిస్తారా? ఆయన అంగీకరించినా, ఆదరికీ ఆమోద యోగ్యం అవుతారా?

 

 

 

Post Midle

అంటే అలాంటి అవకాశం అయితే లేదనే చెప్ప వచ్చని అంటున్నారు.పశ్చిమా బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మంట బెనర్జీ మాత్రం, నేనున్నాను అంటూ, బరిలో నిలిచేందుకు సిద్దం అవుతున్నారు. నిజానికి మమత బెనర్జీ అయినా మరొకరు అయినా ప్రతిపక్ష పార్టీలు అన్నింటికీ, ఆమోదయోగ్యం అవుతారా అంటే, అది కూడా అయ్యే పని కాదు. కానీ, పార్టీని జాతీయ పార్టీగా విస్తరించే ప్రయత్నాలు ప్రారంబించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీని తమ పార్టీ ఎదుర్కుంటుందని, మమత ప్రకటించారు.అంతే కాదు,2024 ఎన్నికల్లో మమతా బెనర్జీని ప్రధాని అభ్యర్ధిగా ఇప్పటినుంచే ప్రధాని అభ్యర్ధిగా జనంలోకి తీసుకు వెళ్లేందుకు ప్రచార కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ‘ఇండియా వాంట్స్ మమతా’ పేరిట వెబ్సైట్’ ను ప్రారంభించారు. అల్టిమేట్’ గ చివరకు ఏమవుతుంది?

 

 

అనే విషయాన్ని పక్కన పెడితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజీపీ కలలను చిత్తు చేసిన మమతా బెనర్జీ, జాతీయ స్థాయిలోనూ బీజేపీకి ప్రదాన ప్రత్యర్ధిగా నిలిచేందుకు గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు.  అయితే, ఇటీవల జరిగిన గోవా,ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దగా ఫలితం లేక పోయింది.రెండు రాష్ట్రాలలోనూ ఒఅక్తి రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే, పశ్చిమ  బెంగాల్’లో మాత్రం ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన మమత,ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి చెమటలు పోయిస్తుననారు. గత సంవత్సరం (2021) మర్త్చి , ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్’కు గాటి పోటీ ఇచ్చినా, చివరకు 77 స్థానాలతోనే సరి పెట్టుకోవలసి వచ్చింది. అయితే, గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎంపీలు వెంటనే రాజీనామా చేయడంతో బీజేపే సంఖ్య 75కు పడిపోయింది. ఇక అప్పటి నుంచి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు తృణమూల్ తీర్ధం పుచ్చుకోవడంతో, 294 మంది సభ్యులు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం 69కి దిగివచ్చింది. తాజాగా బెంగాల్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు, ఎంపీ అర్జున్‌సింగ్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆయ‌న‌తో పాటు త‌న కుమారుడు. ఎమ్మెల్యే  పవన్ సింగ్ తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో .. మమతా బెనర్జీ జాతీయ కళలు ఎలా ఉన్నప్పటికీ. రాష్ట్రంలో మాత్రం బీజేపీకి మమత చుక్కలు చూపిస్తున్నారు. అందుకే  జాతీయ స్థాయిలోనూ బీజేపీకి అయితే గియితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేదా ఆ పార్టీ సారధ్యంలోని కూటమి ప్రధాన ప్రత్యర్ధి అవుతారు. మమతా దీదీ , ప్రధాన మోడీకి ప్రత్యర్ధి అవుతారని రాజకీయ విశ్లేషణలో వినిపిస్తోంది.

 

Tags: Didi as Prime Minister …

Post Midle