సాధారణ మొబైల్‌ వినియోగదారులకు అందుబాటులోకి డిజిటల్‌ లావాదేవీల.

ముంబై ముచ్చట్లు:
ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకే లభించిన డిజిటల్‌ లావాదేవీల సేవలు.. సాధారణ మొబైల్‌ వినియోగదారులకూ అందుబాటులోకి వస్తున్నాయి. ఫీచర్‌ ఫోన్‌ యూజర్లూ తమ మొబైల్‌ నుంచి డిజిటల్‌ లావాదేవీలను జరుపవచ్చు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ‘123పే’ సర్వీస్‌ను ప్రారంభించారు. ఆర్బీఐ ఆధ్వర్యంలోని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ).. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం ఈ సరికొత్త యూఎస్‌ఎస్‌డీ ఆధారిత సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో దేశంలోని 40 కోట్ల మంది ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనున్నది.
ఫీచర్‌ ఫోన్లు అంటే?
ఫీచర్‌ ఫోన్లు.. స్మార్ట్‌ఫోన్లు కావు. కాల్స్‌, మేసేజ్‌ల వంటి కనీస సౌకర్యాలే తప్ప.. ఇంకా ఎటువంటి సదుపాయాలు వినియోగదారులకు ఉండవు. అందుకే వీరికీ డిజిటల్‌ పేమెంట్ల వెసులుబాటును కల్పించాలనే ‘123పే’ సర్వీస్‌ను తెచ్చినట్టు దాస్‌ చెప్తున్నారు.
డిజిటల్‌ లావాదేవీలు ఎలా?
మీ ఫీచర్‌ ఫోన్‌లో ఓ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుందని, ఇది స్మార్ట్‌ఫోన్లతోపాటు ఫీచర్‌ ఫోన్లలోనూ అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ చెప్తున్నది. ఇక దుకాణాల్లో కనిపించే మొబైల్‌ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా కూడా ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు డిజిటల్‌ లావాదేవీలను పూర్తిచేయవచ్చు. మిస్డ్‌ కాల్‌ అనంతరం యూపీఐ పిన్‌ను నమోదు చేయడం ద్వారా లావాదేవీని గుర్తించడానికి కస్టమర్‌కు ఇన్‌కమింగ్‌ కాల్‌ వస్తుంది.
‘123పే’ అంటే ఏమిటి ?
స్కాన్‌ చెల్లింపులు మినహా అన్ని లావాదేవీల కోసం ఫీచర్‌ ఫోన్‌ కస్టమర్లకు ఇది అనుమతినిస్తుంది.ఇంటర్నెట్‌ అక్కర్లేదు. ఫోన్‌లోని మొబైల్‌ నంబర్‌తో కస్టమర్‌ బ్యాంక్‌ ఖాతా అనుసంధానమై ఉండాలి.‘123పే’ ఆధారంగా నాలుగు రకాల సాంకేతిక ప్రత్యామ్నాయాల ద్వారా ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు డిజిటల్‌ లావాదేవీలను చేసుకోవచ్చు.ఐవీఆర్‌ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌) నంబర్‌కు కాల్‌, యాప్‌ వినియోగం, మిస్డ్‌కాల్స్‌, సౌండ్‌ ఆధారిత పేమెంట్లే ఈ ప్రత్యామ్నాయాలు.చెల్లింపులు, బిల్లుల పేమెంట్‌, ఫాస్టాగ్‌ రీచార్జ్‌తో పాటు అకౌంట్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు.బ్యాంక్‌ అకౌంట్ల అనుసంధానానికి, యూపీఐ పిన్‌ మార్పునకూ ఫీచర్‌ ఫోన్ల యూజర్లకు అనుమతి ఉంటుంది.
 
Tags:Digital transactions available to regular mobile users

Natyam ad