ఫుల్ జోష్ లో దిల్ రాజు

Date:15/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోరుమీదున్నాడు. కిందటేడాది ‘ఫిదా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్.. ఈ ఏడాది ‘తొలిప్రేమ’ ద్వారా విజయాన్ని అందుకున్నాడు. తొలిరోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. ఐదురోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.16 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ను వసూలు చేసినట్లు సమాచారం. దీంతో వరుణ్ తేజ్ మరోసారి దిల్ రాజు జేబు నింపుతున్నాడు.గతంలో ‘ఫిదా’ సినిమా ద్వారా దిల్ రాజు బాగానే ఆర్జించారు. ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఆయనే నిర్మించారు. అయితే ‘తొలిప్రేమ’ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనప్పటికీ.. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను దిల్ రాజే కొనుగోలు చేశారు. ‘తొలిప్రేమ’ అన్ని ఏరియాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు రూ.18 కోట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.16 కోట్లు వచ్చేసింది. ఇంకో రెండు కోట్ల రూపాయలు వస్తే దిల్ రాజు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయినట్లే. అయితే సినిమా విడుదలై కేవలం 5 రోజులై అయ్యింది కాబట్టి.. ఇంకా వసూళ్లు దండిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దిల్ రాజుకు ఈ సినిమా కూడా లాభాలు తెచ్చిపెట్టనుంది.కాగా, ‘తొలిప్రేమ’ సినిమా ద్వారా వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. వరుణ్ తేజ్‌కు జంటగా రాశీ ఖన్నా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమా చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు.
Tags; Dil Raju in Full Josh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *