ప్రజలకే నేరుగాసంక్షేమ పథకాలు

పిఠాపురం ముచ్చట్లు:
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా ఎటువంటి అవినీతికి,దళారీవ్యవస్థకి  తావులేకుండా,సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకే నేరుగా అందిస్తున్నారని,ఈ సచివాలయాల వ్యవస్థ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు.పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలానికి సంబంధించిన గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులకు స్మార్ట్ ఫోన్లను  ఎమ్మెల్యే దొరబాబు తన చేతులమీదుగా అందజేశారు.అదేవిధంగా “జగనన్న స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా గ్రామపంచాయతీలకు టాయిలెట్ క్లీనింగ్ మిషన్లను గ్రామ సర్పంచులకు ఎమ్మెల్యే దొరబాబు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరిప్రియ,ఎంపీపీ అరిగెల అచ్చయమ్మారామన్నదొర,జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు,ఏఎంసీ ఛైర్మన్ తెడ్లపు చిన్నారావు,గ్రామసర్పంచ్ అరిగెల మణిబాబు,వైసీపీ నాయకులు కుమారభాస్కరరెడ్డి,మొగలి బాబ్జీ,ముదునూరి కొండబాబురాజు,ఉలవకాయల బాబ్జీ,గుండ్ర రాజుబాబు,కొట్టేటి రాజేశ్,నడిగట్ల చింతలరావు,కోనేటి పెదకాపు తదితరులు పాల్గొన్నారు..
 
Tags:Direct welfare schemes to the people

Natyam ad