Discovering 2018 New Year Calendars, Diaries

2018 నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీల ఆవిష్కరణ

Date : 30/12/2017

పెద్దపంజాణి ముచ్చట్లు:

రానున్న 2018 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మండల యుటీఎఫ్ శాఖ 2018 నూతన సంవత్సరానికి సంబందించిన క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించింది. మండల విద్యాధికారిణి హేమలత చేతులమీదుగా స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో 2018 నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ.రమణ మాట్లాడుతూ క్యాలెండర్లతో పాటు ఆవిష్కరించిన ‘అద్యాపక దర్శిని’ విద్యాసమాచార విషయాలకు చక్కగా ఉపయోగ పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటీఎఫ్ మండల అధ్యక్షుడు జి.ఆంజప్ప, కార్యదర్శి కె.జనార్దన, జి.సాంబిరెడ్డి, ఎం.యుగందర్, జి.గోపాలక్రిష్ణ, కెవి.రమణ, శ్రీనివాసులురెడ్డి, డి.వెంకట్రమణ, పోతయ్య, సి.గుణశేఖర్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags : Discovering 2018 New Year Calendars, Diaries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *